iDreamPost
android-app
ios-app

కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. వారికి 2 లక్ష వరకు సాయం!

కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. వారికి 2 లక్ష వరకు సాయం!

చేతి వృత్తులు, కుల వృత్తుల కళాకారుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ పీఎమ్‌ విశ్వకర్మ’ పేరిట ఓ పథకాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినేట్‌ కమిటీ బుధవారం ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేతివృత్తులు, కుల వృత్తుల కళాకారులకు ఆర్థిక సాయం చేయనుంది. రెండు విడతలుగా వారికి ఆర్థిక సాయం చేయనుంది. మొదటి విడతలో లక్ష రూపాయల సాయం చేయనుంది. ఆర్థిక సాయంతో పాటు పీఎమ్‌ విశ్వకర్మ సర్టిఫికేట్‌, ఐడీ కార్డు ఇవ్వనుంది.

రెండో విడతలో దాదాపు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది. ఆర్థిక సాయంతో పాటు పీఎమ్‌ విశ్వకర్మ సర్టిఫికేట్‌, ఐడీ కార్డు ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి అతి తక్కువ వడ్డీ ఉండనుంది. లబ్ధిదారులు కేవలం 5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 18 సంప్రదాయ వృత్తుల వారికి ఆర్థిక సాయం అందనుంది. ఈ స్కీమ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. 2023 – 2028 మధ్య.. ఏడు సంవత్సరాల కాలానికి గానూ ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.

పీఎమ్‌ విశ్వకర్మ పథకానికి అర్హమైన చేతి, కుల వృత్తులు!

1) వడ్రంగి 2) పడవ తయారీ దారులు 3) కంసాలీ 4) తాళాలు చేసే వారు 5) బంగారు పని వారు 6) కుండలు తయారు చేసేవారు 7) శిల్ప కళాకారులు 8) రాళ్లు కొట్టేవారు 9) చెప్పులు కుట్టే వారు. 10) చీపుర్లు, చాపలు తయారు చేసేవారు 11 ) బొమ్మలు తయారు చేసేవారు 12) మంగళివారు 13) పూల దండలు తయారు చేసేవారు 14 ) చాకలి వారు 15) దర్జీలు 16 ) చేపల వల తయారు చేసేవారు 17) సుత్తెలు, చిన్న చిన్న పరికరాలు తయారు చేసేవారు 18) ఆయుధాలు తయారు చేసేవారు. మరి, కేంద్ర ప్రభుత్వం చేతి, కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం చేయటంపై మీ అభిప్రాయానలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.