Dharani
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ మహిళా యూట్యూబర్ కాళ్లకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ మహిళా యూట్యూబర్ కాళ్లకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
Dharani
ప్రధాన మంత్రి పదవి అంటే దేశంలోనే అత్యున్నతమైనది. ఆ సీటులో కూర్చున్న వ్యక్తికి మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం అత్యంత గౌరవమర్యాదలు ఇస్తారు. అసలు ప్రధానిని నేరుగా కలవడమే చాలా ఎక్కువ.. ఇక ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాక.. ఏకంగా ప్రధాని చేత పాద నమస్కారం పొందడం అంటే మాములు విషయం కాదు. తాజాగా ఇదే సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా యూట్యూబర్ కాళ్లు మొక్కారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు మోదీ ఎందుకు యూట్యూబర్ కాళ్లకు నమస్కరించాడు అంటే..
స్టోరీ టెల్లింగ్, స ఓషల్ చేంజ్ అడ్వకసీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎడ్యుకేషన్, గేమింగ్ రంగాల ప్రభావాన్ని గుర్తించి.. సృజనాత్మకతను సానుకూలంగా మార్చుకునే దిశగా ప్రయాణించే వారికి ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈఅవార్డుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘మార్చి 8, శుక్రవారం ఉడయం 10.30 గంటలకు నేను మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డును అందజేస్తున్నాను. ఈ అవార్డులు ఆవిష్కరణ, సృజనాత్మకత, క్రియేటర్స్ స్ఫూర్తికి సంబంధించిన వేడుక’’ అని పోస్ట్ చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం ఈ వేడుకలు నిర్వహించారు. ఇక నేడు అవార్డు పొందిన వారిలో జాన్వీ సింగ్ ఒకరు. మొట్టమొదటి సారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డు అందుకున్న మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును అందుకున్నారు జాన్వీ సింగ్. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జాన్వీ సింగ్.. అనంతరం ఆయన కాళ్లకు నమస్కరించారు. దాంతో ఆమెను వారించిన మోదీ.. ప్రతిగా ఆయన కూడా జాన్వీ సింగ్ కాళ్లకు నమస్కారం చేశారు. ప్రధాని అయ్యుండి.. ఇలా ఓ సామాన్య మహిళ కాళ్లకు నమస్కరించడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.
నేడు అవార్డు అందుకున్న వారిలో గ్రీన్ చాంపియన్ విభాగంలో పంక్తి పాండే, ఉత్తమ స్టోరీ టెల్లర్‌గా కీర్తిగా గోవిందస్వామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గాయనీ మైథిలీ ఠాకూర్‌కు, టెక్ కేటగిరీలో ఉత్తమ క్రియేటర్‌గా గౌరవ్ చౌదరి, ఫేవరెట్ ట్రావెల్ క్రియేటర్‌గా కమియా జానీ అవార్డులను అందుకున్నారు.
#PMModi awarded #JahnviSingh at the first-ever #NationalCreatorsAwards. As Singh touched the PM’s feet in a sign of respect, the PM reciprocated by touching Singh’s feet, a significant gesture by the country’s leader.#WomensDay #WomensDay2024
⬇️📢🙏https://t.co/GvZxFwkZj5 pic.twitter.com/beeEsP00v8
— Storyboard18 (@BrandStoryboard) March 8, 2024