iDreamPost
android-app
ios-app

నిందితులను విడిచిపెట్టం! మణిపూర్‌ ఘటనపై ప్రధాని మోదీ

  • Published Jul 20, 2023 | 12:26 PM Updated Updated Jul 20, 2023 | 12:26 PM
  • Published Jul 20, 2023 | 12:26 PMUpdated Jul 20, 2023 | 12:26 PM
నిందితులను విడిచిపెట్టం! మణిపూర్‌ ఘటనపై ప్రధాని మోదీ

రెండు నెలలుగా మణిపూర్‌ రావణకాష్టంలా మండుతున్న విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిసస్తున్న విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో తాజాగా సగటు మానవుడు సిగ్గుపడేలా, భారత జాతి తలదించుకునేలా ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారి ప్రైవేట్‌ పార్ట్స్‌పై చేతుల వేస్తూ.. మృగాల్లాంటి పురుషుల గుంపు వారిపై అత్యాచారానికి పాల్పడింది. ఈ ఘటనపై దేశ ప్రధాని తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసి, ఈ క్రమంలోనే మణిపూర్‌ దారుణ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రధాని మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘటన బాధాకరం. ఇది సిగ్గుపడాల్సిన విషయం. కొందరు పాపులు చేసిన పనికి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరైనా సరే.. వారిని విడిచిపెట్టం. కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మహిళ గౌరవాన్ని కాపాడేందుకు ఎందాకైన వెళ్తామని అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మహిళల గౌరవాన్ని రక్షించేందుకు గవర్నర్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్నా.. వాటిని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోవడంతోనే ఈ రోజు ఈ దారుణాన్ని చూడాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!