మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అకౌంట్ లో రూ.50 వేలు..!

Subhadra Yojana Scheme: దేశంలో ఇప్పుడు మహిళాభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాలు అమలు చేస్తూ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాయి.

Subhadra Yojana Scheme: దేశంలో ఇప్పుడు మహిళాభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాలు అమలు చేస్తూ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాయి.

ఒకప్పుడు మహిళలను కేవలం వంట చేయడానికి, ఇంట్లో పనులు చూసుకోవడానికి, పిల్లలతో పాటు ఇంటి పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ కండీషన్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు, స్వయంగా వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ప్రస్తుత సమాజాంలో భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేస్తే కుటుంబం భవిష్యత్ బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. పలు పథకాల కింద మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే స్వయంఉపాధి పనులు కల్పిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఒడిశా రాష్ట్రం మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. ఒక్కొక్కరి అకౌంట్ లో రూ. 50 వేలు జమ చేస్తామని ప్రకటించింది. ఈ పథకం పీఎం నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.సుభద్ర యోజన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్హతలు కలిగిన మహిళలకు ప్రతి సంవత్సరం రూ.10 వేలు జమ చేస్తామని.. ఇలా ఐదు సంవత్సరాలకు రూ.50 వేలు వారి ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ పథకం దాదాపు కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.  ఎన్నికల వేల తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెల్లడించారు.

దేశంలో మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకువచ్చిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఒడిశా ప్రజలకు తమపై విశ్వాస ఉంచి అధికారంలోకి తీసుకువచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోహన్ మాఝీ సారథ్యంలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఈ సుభద్ర యోజన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే ఖరారు చేసిందని తెలిపారు. 26 ఏళ వయసు నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న దాదాపు కోటి మంది అర్హులైన మహిళలకు ఐదేళ్ళ పాటు ఈ పథకం ద్వారా వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని తెలిపారు. కాగా, సుభద్ర యెజన పథకం వచ్చే నెల 17 నుంచి ప్రారంభించేందుకు సిద్దమయ్యిందని తెలిపారు.

Show comments