P Venkatesh
దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ పట్టాలపై పరుగులుపెట్టింది. నేడు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ నమో భారత్ లో ప్రయాణించారు.
దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ పట్టాలపై పరుగులుపెట్టింది. నేడు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ నమో భారత్ లో ప్రయాణించారు.
P Venkatesh
భారత రైల్వే వ్యవస్థలో కీలక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. సమయం ఆదాతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణానికి మార్గం సుగమం అయినట్లైంది. దీనిలో భాగంగానే ఇప్పటికే దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని పలు మార్గాలో వందే భారత్ ట్రైన్లు పరుగులు తీస్తున్నాయి. కాగా ఇప్పుడు అధునాతన సౌకర్యాలతో కూడిన దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలుకు నమో భారత్ గా నామకరణం చేశారు. ఈ క్రమంలో తొలి ‘నమో భారత్’ రైలును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు.
కాగా నేడు ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ స్టేషన్‌లో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌ను ప్రధానమంత్రి మోదీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్‌ఎక్స్ రైలుకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ పట్టాలపై పరుగులుపెట్టింది. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ నమో భారత్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా పీఎం మోడీ స్కూల్ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్ రైలు సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.
కాగా నమో భారత్ రైలు గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా తీర్చిదిద్దారు. ఈ రైలులో ప్రయాణికుల సౌకర్యం దృష్టిలో పెట్టుకుని అధునాతన సదుపాయాలు కల్పించారు. నమోభారత్ రైళ్లలో అన్నీ ఏసీ కోచ్ లే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఛార్జింగ్ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్ వ్యవస్థ ఉంటాయి. ఇక టికెట్ ధర విషయానికి వస్తే.. ప్రామాణిక కోచ్‌లలో టికెట్ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉండనుంది. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందించనున్నాయి.
PM @narendramodi interacts with school children and crew of RapidX train – ‘NaMo Bharat’ – connecting Sahibabad to Duhai Depot, onboard the train.@PMOIndia@officialncrtc#RRTSTrain #RRTS pic.twitter.com/58yaRWyEsa
— DD News (@DDNewslive) October 20, 2023