P Venkatesh
రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ కు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నాయి. రేపు ప్రధాన మంత్రి నిధులను విడుదల చేయనున్నారు.
రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ కు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నాయి. రేపు ప్రధాన మంత్రి నిధులను విడుదల చేయనున్నారు.
P Venkatesh
ఆరుగాళం శ్రమించిన రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ దళారుల నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయమందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే ఏడాదికి రూ. 6 వేలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. సంవత్సరానికి మూడు విడతలుగా విడతకు రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రభుత్వం. ఇప్పటికే 14 విడతలు పుర్తి కాగా 15 వ విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వ సిద్ధమైంది.
రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నది. పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు రేపే డబ్బులు జమ కానున్నాయి. 15వ విడత ద్వారా రూ. 2 వేలను రేపు అనగా 15-11-2023 రోజున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది ప్రభుత్వం. ఈ పథకానికి అర్హులైన దేశంలోని ప్రతి రైతుకు ఈ సాయం అందనున్నది. కాగా ప్రధాన మంత్రి మోడీ పీఎం కిసాన్ నిధులను జార్ఖండ్ లోని ఖుంటిలో బుధవారం ఉదయం విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జార్ఖండ్ లో జరిగే ఓ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ సందర్బంగా 15వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేస్తారు. ఈ విడతలో రూ. 18 వేల కోట్లను పంపిణీ చేయనున్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులు పేరు చెక్ చేసుకోడానికి https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి, బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం ఆప్షన్లను నమోదు చేసి గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. దానిలో మీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందనున్నాయి.