iDreamPost
android-app
ios-app

ఆ గ్రామంలో మహిళలు 5 రోజులు బట్టలు వేసుకోరు.. కారణమేమిటంటే?

  • Published Sep 24, 2024 | 12:44 PM Updated Updated Sep 24, 2024 | 12:44 PM

ఓ గ్రామంలోని వివాహిత మహిళలు, వివాహం చేసుకోవాల్సిన మహిళలు తరతరాలుగా వస్తున్న వింత సంప్రదాయాన్ని ఎంతో భక్తితో ఆచారిస్తున్నారు. అయితే ఆ గ్రామంలోని మహిళలు సంవత్సరంలోన 5 రోజులు పాటు ఒంటి మీద ఒక్క నూలుపోగు లేకుండా ఉంటారట. వినడానికే షాకింగ్ గా, విడ్డూరంగా ఉన్న ఈ ఆచారం ఎక్కడం కొనసాగిస్తున్నారో తెలుసా?

ఓ గ్రామంలోని వివాహిత మహిళలు, వివాహం చేసుకోవాల్సిన మహిళలు తరతరాలుగా వస్తున్న వింత సంప్రదాయాన్ని ఎంతో భక్తితో ఆచారిస్తున్నారు. అయితే ఆ గ్రామంలోని మహిళలు సంవత్సరంలోన 5 రోజులు పాటు ఒంటి మీద ఒక్క నూలుపోగు లేకుండా ఉంటారట. వినడానికే షాకింగ్ గా, విడ్డూరంగా ఉన్న ఈ ఆచారం ఎక్కడం కొనసాగిస్తున్నారో తెలుసా?

  • Published Sep 24, 2024 | 12:44 PMUpdated Sep 24, 2024 | 12:44 PM
ఆ గ్రామంలో మహిళలు 5 రోజులు బట్టలు వేసుకోరు.. కారణమేమిటంటే?

భారతదేశం అనేది సంప్రదాయానికి పుట్టినిల్లు అంటారు.ఇక్కడ విభిన్న మతాలు, కులాలు, తెగల జాతులు వారు నివాసిస్తుంటారు. అయితే ఇక్కడ అందరూ ఒకే రకమైన ఆచారాలను, సంప్రదాయాలను ఆచారించారు. ఎందుకంటే.. దేశంలోని వివిధ ప్రాంతాలకు తగ్గట్టు అక్కడ ప్రజలు ఆచారాలు, సంప్రదాయాల్లో చాలా తేడాలు ఉంటాయి. ముఖ్యంగా వివాహా తంతు విషయానికొస్తే.. ఒక్కో ప్రాంతంలోని ఒకే విధంగా ప్రజలు వివాహంను జరపుకుంటారు. ఇందులో భాగంగానే కొందరు తరతరాలుగా వస్తున్న వారి వివాహ సంప్రదాయాలను పాటిస్తుంటారు.ఇక ఆ సంప్రదాయాలను చూస్తే.. కొన్ని విడ్డూరంగా , మరి కొన్ని మూఢనమ్మకాలుగా అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం దేశంలో ఎన్నో వింతైనా ఆచారాలు, సంప్రదాయాల గురించి వినే ఉంటాం.

కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంప్రదాయం గురించి తెలిస్తే.. ఇదేం విచిత్ర సంప్రదాయంరా బాబోయ్ అంటూ.. షాక్ అవుతారు. అయితే అంతలా షాక్ ఆచారం ఏమై ఉంటుంది అని ఆచార్య పడుతున్నరా..? మరెమీ లేదండీ.. ఓ గ్రామంలో వివాహిత మహిళలు, వివాహం చేసుకోవాల్సిన మహిళలు సంవత్సరంలోన 5 రోజులు పాటు ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా ఉంటారట. వామ్మో.. ఇదెక్కడ ఆచారం విడ్డూరంగా ఉందే.. సాధారణంగా ఒంటినిండా బట్టలు లేకపోతేనే ఊసులేసుకునే రోజుల్లో.. ఏకంగా బట్టలు వేసుకోకుండా ఉండటమంటే.. నిజంగా ఈ సంప్రదాయం మన దేశంలోనేనా అనే సందేహం మీకు కలుగవచ్చు. అయితే ఈ సంప్రదాయం మరెక్కడో కాదు.. మన దేశంలోనే ఓ గ్రామంలోని ప్రజలు ఆచారిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఎందుకు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు? దీని వెనుక ఉన్న కథమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో స్థానికులు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వింత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో మహిళలరు ఎవరు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించారట. అయితే ఈ వింత సంప్రదాయం  హిమచల్ ప్రదేశ్ లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో మహిళలు ఆచారిస్తున్నారు.  ఇక ఈ సంప్రదాయాన్ని ఆచరించే ఐదు రోజులు పిని గ్రామానికి బయట వ్యక్తులు ఎవరూ రారట. అలాగే మహిళలు కూడా బయటకు వెళ్లకుండా.. ఇంటిలోనే ఒంటిమీద నూలు పోగు లేకుండా.. ఆ ఐదు రోజులు ఎంతో నియమ నిష్టలతో సంప్రదాయాన్ని కొనసాగిస్తారట. ఆ సమయంలో పురుషుల కూడా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుదట. ఆ ఐదు రోజుల పాటు పురుషులు మద్యం తాగకూడదు, నాన్ వెజ్ తినకూడదు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు, కనీసం నవ్వుకోకూడదట.

ఒకవేళ ఈ ఆచారాన్ని పాటించకపోయినట్లయితే సదురు మహిళకు చెడు జరుగుతుందని గ్రామస్తులు నమ్మకం. అందుకే ప్రతిఒక్కరూ ఈ ఆచారాన్ని తప్పకూండా కొనసాగిస్తారు. ఇక పెళ్లి కావాల్సిన వాళ్ల విషయానికొస్తే..  వరుడు, వధువులు ఇద్దర్నీ వివాహం జరగబోయే ముందు ఆ గ్రామంలో.. ఒక ఇంట్లో పెడతారట. ఇక వాళ్లు కూడా ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా.. ఒకే ఇంట్లో ఉంటారు. కానీ, ఒకరిని ఒకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం వంటివి చేయారని సమాచారం. ఈ ఆచారాన్ని పాటించిన తర్వాతే పెళ్లి తంతు జరుపుతారు.  నిజానికి ఆ గ్రామంలో పాటిస్తున్న ఈ వింత సంప్రదాయం వెనుక అసలు కథమేటి ఎందుకు గ్రామస్తులు దీనిని ఆచారిస్తున్నారో తెలుసుకుందాం.

 మహిళలు ఆచారించే సంప్రదాయం వెనుక చరిత్ర

పిని గ్రామంలో మహిళలు ఐదు రోజులపాటు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆచారిస్తున్న ఈ ఆచారం వెనుక పెద్ద కథ ఉంది. శతాబ్దాల క్రితం ఆ గ్రామంలోని ఓ రాక్షసుడు.. వివాహిత స్త్రీలను అందమైన దుస్తులు వేసి ఎత్తుకెళ్లే వారట. అప్పుడు ఆ గ్రామంలో..  లహువా ఘోండ్ అనే దేవతకు గ్రామస్తులు మొర పెట్టుకోగా.. ఆమె ప్రత్యక్షమై రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించిందట. అలా వారు చెరపట్టిన మహిళలను విడిపించిందట. అందుకే అప్పటినుంచి.. సంవత్సరంలో 5 రోజులు బట్టలు లేకుండా ఉండడం ఆచారంగా మారిందని గ్రామపెద్దలు చెబుతున్నారు. అలా కాలనుక్రమం ఆచారిస్తున్న ఈ సంప్రదాయంలో  కొంత మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆ గ్రామంలో మహిళలు సన్నని ఉన్ని దుస్తులను ధరించడం మొదలుపెట్టారు. మరి, దేశంలో ఇంతటి వింతైన ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.