iDreamPost
android-app
ios-app

దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.46,715 అంటూ ప్రచారం.. నిజమేంటంటే?

PIB Fact Check On Rs.46,715 For Every Poor Families: ప్రస్తుతం వాట్సాప్ లో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి 46,715 అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో అసలు నిజం ఏంటంటే?

PIB Fact Check On Rs.46,715 For Every Poor Families: ప్రస్తుతం వాట్సాప్ లో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి 46,715 అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో అసలు నిజం ఏంటంటే?

దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.46,715 అంటూ ప్రచారం.. నిజమేంటంటే?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మెసేజ్ రాగానే వెంటనే దానిని మరో పది మందికి షేర్ చేయడమే గానీ.. అందులో అసలు నిజమెంత్ అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. వాట్సాప్ లో ఇలాంటి ప్రచారాలు రోజుకోటి వస్తూ ఉంటుంది. జనాలు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా.. అందరికీ పంపేసి ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలవుతూ ఉంటారు. ఇలాంటి సందేశాలను పంపడం వల్ల వారికి మేలు చేయకపోగా.. వాళ్లు మోసపోయేలా చేసినవాళ్లు అవుతారు. అలాగే ఈమధ్య ఒక మెసేజ్ బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. దేశంలోని ప్రతీ పేద కుటుంబానికి కేంద్రం రూ.46,715 ఇస్తోంది.. వెంటనే మీ వివరాలను ఇందులో నమోదు చేయండి అంటూ ఒక మెసేజ్ ని షేర్ చేస్తున్నారు. ఈ సందేశానికి సంబంధించి కేంద్రానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) స్పందించింది. అందులో ఉన్న అసలు నిజం ఏంటి అనే విషయాన్ని వెల్లడించింది.

దేశంలో ఇలాంటి ప్రచారాలు రోజూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటని ప్రజలు ఊరికే నమ్మేస్తూ మోసపోతున్నారు అని ప్రభుత్వ సంస్థలు ఈ ప్రచారలపై ప్రత్యేకంగా స్పందించాల్సి వస్తోంది. అలాగే ఈ ప్రచారం మీద కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఆ ప్రచారాన్ని పూర్తిగా పరిశీలించి. అదంతా కేవలం తప్పుడు ప్రచారం అని తేల్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరిట ఈ వార్త వైరల్ అవుతోంది. దానిని పీఐబీ ఖండించింది. అలాంటి అవాస్తవాలను నమ్మకండి అని హెచ్చరించింది. అలాగే అలాంటి లింక్స్ పై క్లిక్ చేయండి, మీ వివరాలను ఇవ్వడం చేయకండి అని సూచించింది. ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోకండి.. స్కాములకు గురి కాకండి అంటూ కేంద్రం హెచ్చరించింది. ఇలా సేకరించిన వ్యక్తిగత సమాచారంతో పౌరులను మోసం చేసే ఆస్కారం ఎక్కువగా ఉంది అని తెలియజేశారు. ఇలాంటి వాట్సాప్ సందేశం మీకు వచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.