ఫార్మ‌సీ ఉద్యోగి ఖాతాలోకి రూ. 753 కోట్లు.. కట్ చేస్తే..

ఇటీవల కొంతమంది బ్యాంకు ఖాతాల్లోకి అకస్మాత్తుగా కోట్ల కొలది డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. అప్పటి వరకు వందలు వేలు మాత్రమే ఉండే తమ ఖాతాలోకి హఠాత్తుగా లక్షలు, కోట్లు వచ్చి పడటంతో ఖాతాదారులు మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఖంగారు పడి సదరు బ్యాంకు యాజమాన్యాన్ని సంప్రదించడంతో ఖాతాలను సీజ్ చేస్తున్నారు. గత నెల రాజ్ కుమార్ అనే ఫార్మసీ వర్కర్ ఖాతాలో తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ నుంచి ఏకంగా 9 వేల రూపాలు డిపాజిట్ అయ్యాయి. వెంటనే సదరు ఖాతాదారుడు బ్యాంక్ ని సంప్రదించడంతో సమస్య పరిష్కారం అయ్యింది. తాజాగా అలాంటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. ఓ ఫ్మారసీ ఉద్యోగి ఖాతాలో కోట్ల డబ్బు వచ్చి చేరింది. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒకరికి డిపాజిట్ చేయాల్సిన డబ్బు మరొకరి ఖాతాల్లో వేయడం చూస్తూనే ఉన్నాం. వెంటనే తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవడం తమిళనాడు లో సర్వ సాధారణం అయ్యింది. తాజాగా కొటాక్ మహేంద్ర బ్యాంక్ నుంచి అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాకు చెందిన మహ్మద్‌ ఇక్రీష్‌ చెన్నైలోని తినాం పేటలో ఎల్డామ్స్ రోడ్డు లో నివసిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే మహ్మద్‌ ఇక్రీష్‌ తన బ్యాంక్ అకౌంట్ నుంచి స్నేహితుడికి రూ.2 వేల రూపాయలు శుక్రవారం ఉదయం ట్రాన్స్ వర్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అతనికి ఓ మెసేజ్ వచ్చింది. అది చూసి మహ్మద్‌ ఇక్రీష్‌ కి మైండ్ బ్లాక్ అయ్యింది.

మహ్మద్‌ ఇక్రీష్‌ కి వచ్చిన మెసేజ్ లో ఏకంగా రూ.753 కోట్ల 44లక్షల వరకు బ్యాలెన్స్ చూపించింది. మొదట మెసేజ్ చూసి ఆశ్చర్యపోయినా.. తర్వాత అది బ్యాంక్ తప్పిదం వల్ల జరిగి ఉంటుందిని భావించాడు. మొదట తన ఖాతాలో అంత డబ్బు జమకావడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.. కానీ స్నేహితులు అది బ్యాంక్ చేసిన మిస్టేక్ అని సొంతానికి వాడుకోవద్దని సలహా ఇచ్చారు. వెంటనే మహ్మద్‌ ఇక్రీష్‌ సంబంధిత బ్యాంక్ ఆఫీస్ కి వెళ్లి విషయం చెప్పాడు. కానీ వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో మేనేజర్ ని కలిసి విషయం చెప్పడంతో బ్యాంక్ యాజమాన్య వెంటనే మహ్మద్‌ ఇక్రీష్‌ బ్యాంక్ ఖాతా సీజ్ చేశారు. దీంతో అసంతృప్తికి గురైన మహ్మద్‌ ఇక్రీష్‌ తాను నిజాయితీగా బ్యాంక్ వారికి సమాచారం ఇస్తే.. తన ఖాతానే సీజ్ చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకురావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Show comments