Dharani
బాబా రాం దేవ్ ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ ప్రొడక్ట్ ఒకటి నాణ్యతా పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఆ వివరాలు..
బాబా రాం దేవ్ ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ ప్రొడక్ట్ ఒకటి నాణ్యతా పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఆ వివరాలు..
Dharani
సహజ, ప్రకృతిసిద్ధమైన పదర్థాలతో తయారు చేసిన ఉత్పత్తులు, నాచురల్ తేనె, రసయనాలు వాడని సబ్బులు, సౌందర్య సాధనాలంటూ మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు యోగా గురువు బాబా రాందేవ్. వీటితో పాటు ఆహార ఉత్పత్తులను కూడా తీసుకువచ్చాడు. కల్తీ లేని, రసయనాలు కలవని ప్రొడక్ట్స్ అంటూ జోరుగా ప్రచారం చేశారు. కానీ ఈ మధ్య కాలంలో బాబా రాందేవ్‌కు చెందిన ఆహార ఉత్పత్తి సంస్థ పతంజలికి భారీగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పతంజలి తేనె నాణ్యాత పరీక్షల్లో విఫలం అయిన సంగతి తెలిసిందే. ఇక గతంలో పతంజలి ఉత్పత్తుల వాణిజ్య ప్రకటన అంశంలో సుప్రీం కోర్టు బాబా రాం దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాబా రాందేవ్ పతంజలి కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఆ వివరాలు..
తాజాగా మరోసారి పతంజలి సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ కంపెనీ ఉత్పత్తి అయిన పతంజలి సోన్ పాపిడి.. తాజాగా నిర్వహించిన నాణ్యతా పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో జరిపిన పరీక్షలో పతంజలి కంపెనీ తయారు చేసే సోన్ పాపిడి ఫెయిల్ అయ్యింది. దాంతో పితోర్‌ఘర్ చీష్ జుడీషియల్ మేజిస్ట్రేట్.. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో పాటు మరో ముగ్గురికి జరిమానా.. ఆరు నెలలు జైలు శిక్ష విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్ ప్రధాన మార్కెట్‌లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఇలాచీ సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశౠరు. దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఆ సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ఇక నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఇక ఈమధ్య కాలంలో పతంజలి ఆహార ఉత్పత్తులు వరుసగా నాణ్యతా పరీక్షల్లో విఫలమవుతుండటంం గమనార్హం.