iDreamPost
android-app
ios-app

AC కోచ్‌లో చలి మంటలు.. ఎక్కడ నుండి వచ్చార్రా అయ్యా మీరంతా!

  • Published Jan 18, 2024 | 9:51 PM Updated Updated Jan 18, 2024 | 9:51 PM

ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో చలి చంపేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాధిన చలితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రయాణాలు చేసే వారి పరిస్తితి మరీ దారుణం. పది గంటల వరకు మంచు కప్పేసి ఉంటుంది.

ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో చలి చంపేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాధిన చలితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రయాణాలు చేసే వారి పరిస్తితి మరీ దారుణం. పది గంటల వరకు మంచు కప్పేసి ఉంటుంది.

AC కోచ్‌లో చలి మంటలు.. ఎక్కడ నుండి వచ్చార్రా అయ్యా మీరంతా!

ఇటీవల దేశ వ్యాప్తంగా రైల్ ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాంకేతిక లోపాలు, సిగ్నల్స్ తప్పిదాలు, మనుషులు చేస్తున్న పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని అధికారులు అంటున్నారు. చాలా మంది సూదర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ట్రైన్ ప్రయాణాలకే మొగ్గు చూపిస్తుంటారు. సామాన్యులే కాదు సంపన్నులు సైతం ట్రైన్ ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ట్రైన్ లో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇక ట్రైన్ లో రక రకాల సంఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది ట్రైన్ లో మంటలు వేయడంతో తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం శీతాకాలం కావడంతో చాలా మంది చలితో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సైతం చలిమంటలు వేసుకుంటున్నారు. కొన్నిసార్లు చలిమంటలు ప్రమాదంగా మారుతున్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా కొంతమంది ప్రయాణికులు ఏసీ కోచ్ లో చలి మంటలు వేశారు. ఇది చూసి తోటి ప్రయాణికులు అగ్ని ప్రమాదం జరుగుతుందన్న భయంతో వణికిపోయారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. వెంటనే కొంతమంది ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. మీరట్ – ప్రయాగ్ రాజ్ సంగం ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ కోచ్ లో కొంతమంది వ్యక్తలు చలిమంటలు వేసుకున్నారు. కదులుతున్న రైలు అందులోనూ ఏసీ కోచ్ లో చలిమంటలు వేయడంతో తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

ఏసీ బోగి లో చలిమంటలు వేయడం వల్ల ప్రమాదం జరగవొచ్చని కొంతమంది ప్రయాణికులు వారితో అన్నారు. అయినా కూడా వినిపించుకోకుండా ఆ ప్రయాణికులు ట్రైన్ లో మంటలు వేసుకొని చలి కాపుకున్నారు. దాంతో కొంతమంది ప్రయాణికులు ఆ ఘటన ను సెల్ ఫోన్ లో వీడియో తీసి.. పక్క కంపార్ట్ మెంట్ లో ఉన్న టీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న టీసీ, రైల్వే పోలీసులు చలిమంట వేసుకున్న ప్రయాణికులను నిలదీశారు. చలిమంటలు వేసిన వారిపై కేసు నమెదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు వెల్లడించారు. ఈ ఘలనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.