iDreamPost
android-app
ios-app

పార్లమెంట్ ఘటన నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు.. నా కొడుకుని ఉరి తీయండి

  • Published Dec 14, 2023 | 9:26 AM Updated Updated Dec 14, 2023 | 9:26 AM

Parliament Security Breach: పార్లమెంటుపై ఉగ్రదాడికి 22 ఏళ్లు పూర్తయిన నాడే.. మరోసారి పార్లమెంట్ లో ఆగంతకులు చోరబడి బీభత్సం సృష్టించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందుతుల్లో ఒకరి తండ్రి దీనిపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

Parliament Security Breach: పార్లమెంటుపై ఉగ్రదాడికి 22 ఏళ్లు పూర్తయిన నాడే.. మరోసారి పార్లమెంట్ లో ఆగంతకులు చోరబడి బీభత్సం సృష్టించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందుతుల్లో ఒకరి తండ్రి దీనిపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Dec 14, 2023 | 9:26 AMUpdated Dec 14, 2023 | 9:26 AM
పార్లమెంట్ ఘటన నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు.. నా కొడుకుని ఉరి తీయండి

దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం పార్లమెంట్ అని చెప్పవచ్చు. దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు.. వెళ్లే ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అయితే బుధవారం నాడు మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది.  కొందరు ఆగంతకులు లోక్ సభలో చొరబడి నానా బీభత్సం సృష్టించిన ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అది కూడా పార్లమెంటుపై దాడి జరిగిన 22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజున అలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో.. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

భద్రతా వైఫల్యం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాప్తను ప్రారంభించారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన ఓ నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకును ఉరి తీయమని చెప్పడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

manoranjan parliment attack

2001 పార్లమెంటుపై దాడి జరిగిన 22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు మరోసారి లోక్ సభలోకి ఆగంతకులు చొరబడి గందరగోళం సృష్టించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. ప్రస్తుతం అధికారులు అతడి కోసం వెతుకుతున్నారు. అయితే ఈ ఘటనపై నిందితుల్లో ఒకరి తండ్రి స్పందించారు. తన కొడుకు చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు.

పార్లమెంటులోకి ప్రవేశించిన నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు.. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి.. అందులో చొరబడటం తప్పేనని అంగీకరించాడు. ఇక తన కొడుకు తప్పు చేసినట్లైతే అతడిని ఉరితీయాలంటూ దేవరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని.. కానీ ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే..

నలుగురు వ్యక్తులు పార్లమెంటులో చొరబడి.. కలకలం సృష్టించారని ముందుగా భావించారు. కానీ ఈ వ్యవహారంతో మొత్తం ఆరుగురికి సంబంధం ఉందని తర్వాత పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో సాగర్ శర్మ, మనోరంజన్‌, అమోల్ షిండే, నీలం దేవి కౌర్‌లు పార్లమెంటు లోపల, బయట గందరగోళం సష్టించారు. వీరిని అక్కడ ఉన్న ఎంపీలు, పోలీసులు పట్టుకున్నారు.

ఇక ఈ నలుగురితోపాటు గురుగ్రామ్‌కు చెందిన లలిత్ ఝా, విక్కీ శర్మలు కూడా ఇందులో పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరంతా లలిత్ ఝా ఇంట్లోనే బస చేసినట్టు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ నిందితుల్లో సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనోరంజన్ కర్ణాటకలోని మైసూర్‌. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్‌.

manoranjan parliment attack

వేర్వురు ప్రాంతాలకి చేందిన వీరందరికీ ఆన్‌లైన్‌లోనే పరిచయం ఏర్పడిందని.. పక్కా ప్లాన్‌ ప్రకారమే వీరంతా పార్లమెంట్‌లో అలజడి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్‌లతోనే వీరు పార్లమెంట్‌లోకి వచ్చినట్టు తెలిపారు పోలీసులు. వీరిలో నీలం దేవి.. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారని.. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల్లో పాల్గొందని.. కానీ ఆమెకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున..

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున అనగా 2001 డిసెంబర్ 13 వ తేదీన పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. నాటి ఘటనలో 5 ఉగ్రవాదులు సహా 15 మంది చనిపోయారు. ఈ దాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తి కాగా.. చనిపోయిన వారికి పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఈ నివాళుల కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే లోక్‌సభలో జీరో అవర్‌ నడుస్తుండగానే.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.