Keerthi
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలతో భయపడుతున్న సామాన్య ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. మరి కొన్ని రోజుల్లో వాటి ధరలు కూడా అమాంతం పెరగనున్నాయి. దీంతో సామన్యులకు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలతో భయపడుతున్న సామాన్య ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. మరి కొన్ని రోజుల్లో వాటి ధరలు కూడా అమాంతం పెరగనున్నాయి. దీంతో సామన్యులకు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
Keerthi
ప్రస్తుత కాలంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయం సవాళ్లతో కూడుకున్నది. ఎందుకంటే.. దేశంలో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల వరకు అన్నీ ఇలా ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇళ్లలో అవసరాలతో పాటు , ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగిపోతున్నాయి. ఏది కొనాలనుకున్న ధరలు మండిపడుతుండటంతో.. ఇటు అవసరం అగాక, ఆర్థిక స్తోమత లేక ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇకపై సామాన్యుల జేబులపై మరింత భారం పెరుగనుంది. ఇంకొన్ని రోజుల్లో నిత్యవసర మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఈ విషయం తెలియడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకి ఎప్పుడంటే..
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్న వేల మరోసారి భారీ షాక్ తగిలింది. ఇక నుంచి అనారోగ్యంతో మెడికల్ షాప్ కు వెళ్లి ట్యాబ్ లెట్స్ తెచ్చుకోవాలనుకున్న.. భయపడే పరిస్థితి నెలకొంది. ఇక ఈ ధరలనేవి ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఇందులో పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీబయాటిక్స్ వరకు అన్నీ ఉంటాయి. కాగా, వీటిలో నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వంటివి 800 మందులు ఉన్నాయి. నిజానికి వార్షిక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో మార్పుకు అనుగుణంగా.. మందుల కంపెనీల ధరలను పెంచేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మందుల ధరలను పెంచాలని ఫార్మా పరిశ్రమ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం అందింది.
ఇక ఈ టోకు ధరల సూచికలో వార్షిక మార్పులకు అనుగుణంగా.. 0055% పెరుగుదలను అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే గత సంవత్సరం 2023, 2022లో కూడా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) క్రింద మందుల ధరలు రికార్డు స్థాయిలో 12% నుంచి 10% పెరిగాయి. అయితే.. అవసరమైన ఈ మందుల జాబితాలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, యాంటీబయాటిక్స్, రక్తహీనత నిరోధక మందులు, విటమిన్లులకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే, కోవిడ్-19 రోగులకు మధ్యస్తంగా చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని మందులు, స్టెరాయిడ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, పరిశ్రమలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతో సతమతమవుతునందు వల్లే ఈ ధరలను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఔషధ పదార్ధాల ధరలు 15% నుంచి 130% మధ్య పెరిగాయి.అందులో పారాసెటమాల్ ధర 130%, ఎక్సిపియెంట్ల ధర 18-262% పెరిగింది. గ్లిజరిన్ , ప్రొపైలిన్ గ్లైకాల్‌తో సహా ద్రావకాలు, సిరప్‌ల ధరలు ఇలా వరుసగా 263% నుంచి 83% పెరిగాయి. వీటిలో పెన్సిలిన్ జి ధర 175% కు పెరిగింది. అంతకుముందు మాత్రం 1,000 మంది భారతీయ ఔషధ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాబీ గ్రూప్ కూడా తక్షణమే అమలులోకి వచ్చేలా ధరలను 10% పెంచడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది.అయితే ఇందులో నాన్ షెడ్యూల్డ్ మందుల ధరలను 20% పెంచాలని డిమాండ్ చేసింది. మరి, పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలతో పాటు మందుల ధరలు కూడా పెరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.