Krishna Kowshik
సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలే కాదూ.. సౌతిండియా మొత్తం జరుపుకుంటూ ఉంటుంది. సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. ఎక్కడ లేని ఉత్సాహం, ఉల్లాసం వస్తూ ఉంటుంది. ఇక స్వగ్రామాలకు రెక్కలు విప్పుకుని రయ్ మంటూ ఎగిరిపోతుంటారు ప్రజలు.. ఇదే సమయంలో..
సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలే కాదూ.. సౌతిండియా మొత్తం జరుపుకుంటూ ఉంటుంది. సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. ఎక్కడ లేని ఉత్సాహం, ఉల్లాసం వస్తూ ఉంటుంది. ఇక స్వగ్రామాలకు రెక్కలు విప్పుకుని రయ్ మంటూ ఎగిరిపోతుంటారు ప్రజలు.. ఇదే సమయంలో..
Krishna Kowshik
‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద..సరదాలు తెచ్చిందే తుమ్మెద.. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో.. ఊరే ఉప్పొంగుతుంటే ఏ ఏ ఏ.. ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం.. కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో పొంగే హేమంత సిరులు’ అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు మురిసిపోతుంటారు. ఈ పెద్ద పండుగ నాడు.. ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు, బంధువులు, చుట్టాలు సొంత ఊర్లకు చేరుకుని సందడి చేస్తుంటారు. పండుగ మూడు రోజులు ప్రతి ఇల్లు నందనవనమేనని చెప్పొచ్చు. కొత్త అల్లుడికి విందు భోజనాలతో మర్యాదలు చేస్తారు అత్తింటి వాళ్లు. అలాగే దూరా భారాల్లో పని చేసుకుంటున్న వారు సైతం తమ స్వగ్రామాలకు పయనం అవుతుంటారు.
పండుగ అనగానే స్వగ్రామానికి బయలు దేరిన భార్యా భర్తల్ని.. రోడ్డు ప్రమాదం బలితీసుకుని.. సంక్రాంతి వేళ ఆ ఇంట్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని టి. నరిసిపుర తాలూకాలోని హిరియూరుకు చెందిన దర్శన్, జ్యోతి భార్యాభర్తలు. వీరికి పెళ్లై రెండేళ్లు అవుతుంది. జ్యోతి స్వస్థలం తమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలోని కొడవత్తి. భార్యా భర్తలు బెంగళూరులో ఉంటున్నారు. పండుగ నిమిత్తం.. బెంగళూరు నుండి దర్శన్ సొంతూరికి బయలు దేరారు భార్యా భర్తలు. బైక్ పై వెళుతుండగా.. మాండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని ఉప్పినకెరె గేట్ వద్దకు రాగానే.. కారు.. వీరి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే మరణించారు దంపతులు. సమాచారం అందుకున్న మద్దూరు పోలీసుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.