రైలుకు ఎదురెళ్లి వందల మంది ప్రాణాలు కాపాడిన వృద్దదంపతులు.. అసలేం జరిగింది?

Hundreds of lives were saved Old Couple: వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురి కాకుండా ఓ వృద్ద దంపతులు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ దంపతులు చేసిన సాహసం ఏంటంటే..

Hundreds of lives were saved Old Couple: వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురి కాకుండా ఓ వృద్ద దంపతులు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ దంపతులు చేసిన సాహసం ఏంటంటే..

ఈ కాలంలో ఎవరి స్వార్థం వారిదే.. ఎదుటి వాళ్లు ఏమైతే నాకేంటీ అనుకునే ప్రపంచం. కానీ కొంతమంది తాము క్షేమంగా ఉండాలి.. పది మంది క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారిలో తమిళనాడులోని తెన్‌కాశీ కి చెందిన వృద్ద దంపతులు ఒకరు. తాము చనిపోతామని తెలిసి కూడా వందల మంది ప్రాణాలు కాపాడి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. ఆ వృద్ద దంపతులు చేసిన ధైర్య సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ దంపతులు ఏం చేశారు..? వందల మంది ప్రాణాలు ఎలా కాపాడగలిగారు? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కేరళా నుంచి తమిళనాడులోని తుత్తుకూడికి లారీ వెళ్తుంది.. తెన్‌కాశీ వద్ద ఎస్ వేలపు ప్రాంతంలోకి రాగానే అదుపు  తప్పిలారీ రైల్వే ట్రాక్ పై బోల్తా పడింది. అదే సమయంలో తిరునెల్వేలి- పాలక్కడ్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తుంది. రైల్వే ట్రాక్ పై లారీ బోల్తా పడి ఉండటాన్ని తెన్‌కాశీకి చెందిన షన్ముగయ్య ఆయన భార్య కురుంతామ్మల్ గమనించారు. పెద్ద ప్రమాదం జరగబోతుందని భయపడ్డారు.. అంతలోనే ధైర్యం చేసి తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు.. రైలుని ఆపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే చేత్తో టార్చ్ పట్టుకొని ట్రాక్ పై పరుగెత్తుకుంటూ దంపతులు లోకో పైలట్ కి సిగ్నల్ ఇచ్చారు. అది గమనించి లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేసి రైల్ ని ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది.

ఇదిలా ఉంటే రైల్వే ట్రాక్ పై అదుపుతప్పి పడిపోయిన లారీ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అందులో ఉన్న డ్రైవర్ చనిపోయాడు. ప్రమాదాన్ని ముందుగా గమనించి క్లీనర్ లారీ దూకి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతి చెందిన లారీ డ్రైవర్ ముక్కుదాల్ ప్రాంతానికి చెందిన మణికందన్ గా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్ క్లీయర్ అయిన తర్వాత రైళ్ల రాకపోకలకు అనుమతినిచ్చారు అధికారులు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా షణ్మగయ్య, కురుంతమ్మాళ్ చేసిన సాహసానికి అధికారులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. తమ స్వార్థం మాత్రమే చూసుకునే ఈ రోజుల్లో వృద్ద దంపతులు చేసిన సాహసంపై అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments