iDreamPost
android-app
ios-app

ఆఫీసులకు కుర్తా వేసుకుని రండి.. ఆ వెస్టర్న్ డ్రెస్సులెందుకు: ఓలా సీఈఓ

  • Published Jul 11, 2024 | 9:38 AM Updated Updated Jul 11, 2024 | 2:06 PM

Come To Office In Indian Attire Said Ola CEO Bhavish Aggarwal: భారతీయులందరూ ఆఫీసులకు కుర్తా వేసుకుని రండి. విదేశీ దుస్తుల కంటే మన భారతీయ దుస్తులే సౌకర్యంగా ఉంటాయి. కాబట్టి భారతీయులు, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు ఆఫీసులకు కుర్తాలు వేసుకుని రండి అంటూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ రిక్వెస్ట్ చేశారు.

Come To Office In Indian Attire Said Ola CEO Bhavish Aggarwal: భారతీయులందరూ ఆఫీసులకు కుర్తా వేసుకుని రండి. విదేశీ దుస్తుల కంటే మన భారతీయ దుస్తులే సౌకర్యంగా ఉంటాయి. కాబట్టి భారతీయులు, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు ఆఫీసులకు కుర్తాలు వేసుకుని రండి అంటూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ రిక్వెస్ట్ చేశారు.

ఆఫీసులకు కుర్తా వేసుకుని రండి.. ఆ వెస్టర్న్ డ్రెస్సులెందుకు: ఓలా సీఈఓ

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భారతీయ సంస్కృతి ఆల్మోస్ట్ ఐసీయూలో పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. శిథిలావస్థలో ఉన్న భారతీయ వైభవాన్ని ఇప్పుడిప్పుడే బాగు చేస్తున్నారు నేటి యువతరం. అచ్చమైన భారతీయులు ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలంటేనే వెస్టర్న్ కల్చర్ ని దిగుమతి చేసుకుని ఉంటాయి. ఆ వాతావరణం, ఆ హడావుడి, అంతా విదేశీ కల్చర్ నే పోలి ఉంటాయి టెక్ కంపెనీలు. బాస్ అయినా, ఐటీ ఉద్యోగులు అయినా సరే సూటు, బూటు వేసుకుని తీరాల్సిందే. బ్రాండెడ్ దుస్తులు ధరించాల్సిందే. ఫారినర్ లా కనిపించాల్సిందే అన్న ఒక రూల్ ని రుద్దేశారు. ఇలాంటి కల్చర్ మధ్య భారతదేశ సంస్కృతి జీవించడం అంటే మామూలు విషయం కాదు. మన ట్రెడిషనల్ దుస్తులు ధరించి ఆఫీసులకు వెళ్తే నవ్వుతారేమో అని అనుకునే పరిస్థితి.

అయితే ఇప్పుడు కొన్ని కంపెనీల బాస్ ల ఆలోచన దృక్పథం మారుతుంది. ఆఫీసులకు ట్రెడిషనల్ దుస్తుల్లో రండి అని ఉద్యోగులకు సూచిస్తుండడం విశేషం. తాజాగా ఓలా వ్యవస్థాపకులు, సీఈఓ భవిష్ అగర్వాల్ కూడా ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరూ వెస్టర్న్ దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని అన్నారు. కుర్తాల్లో మనం చాలా సౌకర్యంగా ఉండవచ్చునని.. ఇది భారతీయుల కోసం ప్రత్యేకంగా ఉన్న కల్చర్ అని అన్నారు.

తన దృష్టిలో కుర్తా చాలా సొగసైన డ్రెస్ అని.. భారతీయులు.. ముఖ్యంగా యువ టెకీలు కుర్తాలను ధరించాలని కోరుకుంటున్నా అని అన్నారు. జూలై 8న షేర్ చేసిన పాడ్ కాస్ట్ లో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. కాగా ఈ పాడ్ కాస్ట్ అతి తక్కువ సమయంలోనే రీచ్ పొందింది. భవిష్ అగర్వాల్ అభిప్రాయాలతో చాలా మంది ఏకీభవిస్తూ కామెంట్స్ చేశారు. కాగా ఇటీవల భవిష్ అగర్వాల్ గూగుల్ కంపెనీకి షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గూగుల్ కి వందల కోట్ల నష్టం వాటిల్లనుంది. దీంతో గూగుల్ ని చావు దెబ్బ కొట్టినట్లు అయ్యింది. విదేశీ కంపెనీని కాదని స్వదేశీ కంపెనీకి ఓటు వేశారు. ఈ కథనం చదవడం కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.