iDreamPost
android-app
ios-app

వీడియో: డ్యూటీ దిగినా బాధ్యత మర్చిపోలేదు! హ్యాట్సాఫ్

  • Published Sep 02, 2024 | 9:27 AM Updated Updated Sep 02, 2024 | 9:27 AM

Mumbai Railway Station: సాధారణంగా కొంతమంది తమ డ్యూటీ ముగించుకొని ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని చూస్తుంటారు. ఆ సమయంలో ఏదైనా పని వస్తే కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏ క్షణంలో అయినా సరే తమ విధులు మర్చిపోరు.

Mumbai Railway Station: సాధారణంగా కొంతమంది తమ డ్యూటీ ముగించుకొని ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని చూస్తుంటారు. ఆ సమయంలో ఏదైనా పని వస్తే కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏ క్షణంలో అయినా సరే తమ విధులు మర్చిపోరు.

వీడియో: డ్యూటీ దిగినా బాధ్యత మర్చిపోలేదు! హ్యాట్సాఫ్

ఇటీవల రైల్వే ఫ్లాట్ ఫామ్ వద్ద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలు ఎక్కే సమయంలో.. దిగే సమయంలో ప్రయాణికులు చేసే పొరపాటు వల్ల ట్రాక్ లో జారిపడిపోవడం చూస్తుంటాం. ఆ సమయంలో రైల్వే సెక్యూరిటీ, తోటి ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయి వారిని రక్షిస్తుంటారు. కొన్ని సమయాలో ప్రమాదవశాత్తు చనిపోవడం జరుగుతుంది. రైల్ ట్రాక్ కి దగ్గరగా ఉండకూడదు,ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని రైల్వే సిబ్బంది ఎంతగా హెచ్చరించినా కొంతమంది ప్రయాణికులు తొందరపాటు వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నారు.ఓ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో లేకున్నా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించినందుకు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ పోలీస్ ఏం చేశారో అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

చాలా మంది ఉద్యోగులు తమ డ్యూటీ పూర్తయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్లి సేద తీరాలనుకుంటారు. కానీ.. ఓ రైల్వే పోలీస్ మాత్రం తాను డ్యూటీలో లేకున్నా ఆపదలో ఉన్న ఓ ప్రయాణికుడిని ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బలాసో ధాగే అనే రైల్వే కానిస్టేబుల్ తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. అంతలోనే కదులుతున్న రైలుకు, ఫ్లాట్ ఫామ్‌కు మధ్య ఓ ప్రయాణికుడు చిక్కుకోవడం చూసి రెప్పపాటున అతన్ని బయటకు లాగేశాడు.   దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.  గోరేగావ్ రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన జరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బలాసో ధాగే కి మహారాష్ట్ర ప్రభుత్వం తగు సత్కారం చేసేందుకు సిద్దమైంది.. ఉన్నతాధికారులు అతన్ని ఎంతగానో మెచ్చుకొని అభినందించారు. ఇప్పటికే ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ముప్పవేలకు పైగా లైకులు వచ్చాయి. రైల్వే పోలీస్ కానిస్టేబుల్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘డ్యూటీలో లేకుండా విధులు మర్చిపోకుండా ప్రయాణికుడిని కాపాడిన ఈ కానిస్టుబుల్ కి సెల్యూట్ చెప్పాల్సిందే’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.‘ప్రమాదం నుంచి ఓ వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలు సైతం అడ్డు వేసే ఇలాంటి సన్సియర్ పోలీసులు చాలా రేర్ గా ఉంటారు.. ఈ పోలీస్ కి హ్యట్సాప్’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా ఎన్నో రకాలుగా కామెంట్స్ వస్తూ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Police (@mumbaipolice)