ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఈ కీలక మార్పులు తెలియకపోతే నష్టపోతారు!

మరో రెండ్రోజుల్లో ఫిబ్రవరి నెల మొదలవనుంది. అయితే ఈ నెలలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన రూల్స్​లో మార్పులు జరగనున్నాయి. ఆ నియమాలు ఏంటి? వాటి వల్ల మీకు లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మరో రెండ్రోజుల్లో ఫిబ్రవరి నెల మొదలవనుంది. అయితే ఈ నెలలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన రూల్స్​లో మార్పులు జరగనున్నాయి. ఆ నియమాలు ఏంటి? వాటి వల్ల మీకు లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి తెలుసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి సంవత్సరం మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. మరో నెలలో ఆర్థిక సంవత్సరం అయిపోనుండటంతో ఫిబ్రవరి నెలలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి రూల్స్​లో మార్పులు జరగనున్నాయి. అవి నేరుగా వినియోగదారుల మీద ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ కీలక మార్పులు ఏంటి? వాటి వల్ల లాభమా? లేదా నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఎంపీఎస్
ఫిబ్రవరి 1 నుంచి వినియోగదారులు తాము డబ్బులు పంపాలనుకున్న వ్యక్తి ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలిపి ఐఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు. ఇక మీదట బెనిఫిషియరీగా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే నగదు బదిలీ చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) తెలిపింది. అలాగే పేమెంట్స్ చేసే సమయంలో ఐఎఫ్​ఎస్​సీ కోడ్ కూడా ఎంటర్ చేయనక్కర్లేదని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ విధానాల్లో ఫోన్ నంబర్, బ్యాంక్ పేరు ద్వారా నిధుల బదిలీని స్టార్ట్ చేయాలని ఎన్​పీసీఐ తెలిపింది.

ఎన్​పీఎస్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షికంగా విత్​డ్రా చేసుకునేందుకు ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. స్పెషల్ రీజన్స్ ఉంటేనే విత్​డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మొదటిసారి ఇల్లు కొనేవారు కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

ఎస్​బీఐ హోమ్ లోన్ డిస్కౌంట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తమ వినియోగదారుల కోసం స్పెషల్ హోమ్ లోన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. దీని కింద ఇంటి రుణాల మీద కస్టమర్లకు 65 బేసిస్ పాయింట్ల ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజులో కూడా రిబేట్ బెనిఫిట్ ఉంది. జనవరి 31వ తేదీతో ఈ క్యాంపెయిన్ ముగియనుంది.

ఫాస్టాగ్ కేవైసీ
ఫాస్టాగ్ నిబంధనలు కూడా ఇప్పుడు మారనున్నాయి. కేవైసీని ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. అందుకోసం జనవరి 31 చివరి తేదీ. ఈ గడువు లోపు కేవైసీ పూర్తి చేయకపోతే ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకులు ఫాస్టాగ్​ను డీయాక్టివేట్ చేసి బ్లాక్ లిస్ట్​లో పెట్టనున్నాయి. ఫాస్టాగ్ కేవైసీ పూర్తికాని వెహికిల్స్​ను డీయాక్టివేట్ చేస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్ సబ్​స్క్రిప్షన్
2024లో మొదటి సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్​జీబీ) సిరీస్ ఫిబ్రవరి నెలలోనే ఓపెన్ అవుతోంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫిబవ్రరి 12 ఉంచి ఈ బాండ్స్​ను కొనుగోలు చేయొచ్చు. వీటిల్లో పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువగా ఉంటుంది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 12వ తేదీ నుంచి 16 వరకు సావరిన్ గోల్డ్ బాండ్ సబ్​స్క్రిప్షన్ విండో తెరిచి ఉంటుంది. అదే నెల 21వ తేదీన ఈ బాండ్లను జారీ చేయనున్నారు.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్​డీ
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అందిస్తున్న స్పెషల్ ఎఫ్​బీ స్కీమ్ జనవరి 31తో ముగుస్తుంది. 7.40 వడ్డీ రేటును అందించే ‘444 డేస్’ స్పెషల్ ఎఫ్​డీ స్కీమ్ ఈ నెల ఆఖరి తేదీతో క్లోజ్ అవుతుంది. కాబట్టి అర్హత కలిగిన వాళ్లు గడువు తేదీకి ముందే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

Show comments