కోల్‌కతా ట్రైనీ డాకర్ట్ కేసు: నిందితుడి నార్కో టెస్ట్‌.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యారాచం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కోల్‌కొతాలో ఎంతో ప్రసిద్ది చెందిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఈ దారుణంపై దేశం మొత్తం నిరసనలలు వెల్లువెత్తుతున్నాయి.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యారాచం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కోల్‌కొతాలో ఎంతో ప్రసిద్ది చెందిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఈ దారుణంపై దేశం మొత్తం నిరసనలలు వెల్లువెత్తుతున్నాయి.

కోల్‌కొతా ట్రైనీ వైద్యురాలిపై జరిగిన దారుణం దేశం మొత్తం ఆగ్రహవేశాలకు గురి చేసింది. ఒక మహిళ డాక్టర్ కి రక్షణ లేకపోవడం పై వైద్యులు, సామాన్యులు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేసి సీబీఐ విచారిస్తుంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన సంజయ్ రాయ్ కి నార్కో టెస్ట్ నిర్వహించాలని సీబీఐ కోల్‌కొతా హైకోర్టుని కోరింది. అయితే సీబీఐ కి అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గత వారం కోల్‌కొతా కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పిటీషన్ తిరస్కరించింది. అతడి జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 20 వరకు పొడగించిన విషయం తెలిసిందే. గురువారం నిందితుడి దంత ముద్రలు, లాలాజల నమూనా సీబీఐ సేకరించింది. ట్రైనీ డాక్టర్ శరీరంపై ఫోరెన్సిక్ నిపుణులు పళ్లతో కొరికిన గాయాలు గుర్తించారు. నేరంలో నిందితుడి ప్రమేయం గురించి స్పష్టత పొందడానికి డాక్టర్ శరీరంపై కనిపించిన గుర్తులలతో వీటిని పోల్చి చూస్తారు. సాక్ష్యాలు పరిశీలించడం కోసం సీబీఐ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరి సహాయం తీసుకుంటుంది.

నార్కో టెస్ట్ అంటే ఏంటీ?

నేరస్తుల విషయంలో ఈ పరీక్షలు జరుపుతుంటారు. నార్కో టెస్ట్ లేదా నార్కో అనాలసిస్ అని కూడా పిలుస్తుంటారు. ఇది హిప్నోటిక్ లేదా సెమీ- కాన్షియస్ స్థితిని ప్రేరేపించే మత్తు అందించడం ద్వారా ఒక వ్యక్తి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించే ఒక రకమైన పరిశోధనాత్మక విధానం. నిందితులకు సోడియం పెంటోథాల్ ని వినియోగిస్తారు దీన్నే ట్రూత్ సీరం ని కూడా పిలుస్తుంటారు. ఈ మెడిసన్ వ్యక్తి కాన్సియస్ తగ్గించి స్వేచ్చగా, దాపరికం లేకుండా మాట్లాడటానికి వీలు కల్పిస్తుంది. ఈ పరీక్షలో నేరస్తులు చాలా నిజాలు చెబుతుంటారని అధికారులు అంటున్నారు.

Show comments