iDreamPost
android-app
ios-app

మ్యాంగో జ్యూస్ కాదు విషం.. ఈ కంపెనీ ఉత్పత్తులు కొంటున్నారా? జాగ్రత్త

  • Published Aug 31, 2024 | 11:48 AM Updated Updated Aug 31, 2024 | 11:48 AM

Poisonous Mango Juice: ప్రతీది కల్తీ అయిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టినా గానీ నాణ్యమైన ఆహార పదార్థాలు దొరకడం లేదు. కంపెనీలు పైకి చెప్పేదొకటి.. లోపల చేసేదొకటి. రంగులు, రసాయనాలు కలిపేసి అమ్మేస్తున్నారు. మరీ ఎంత కల్తీ చేసినా గానీ ఆ ఉత్పత్తికి సంబంధించిన వస్తువు అయితే అందులో ఉండాలి కదా. మ్యాంగో జ్యూస్ తయారీ అంటే మామిడి పండ్లు ఉండాలి కదా. కానీ ఆ మామిడి పండ్లే లేకుండా మామిడి రసాలు అమ్ముతున్నారు.

Poisonous Mango Juice: ప్రతీది కల్తీ అయిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టినా గానీ నాణ్యమైన ఆహార పదార్థాలు దొరకడం లేదు. కంపెనీలు పైకి చెప్పేదొకటి.. లోపల చేసేదొకటి. రంగులు, రసాయనాలు కలిపేసి అమ్మేస్తున్నారు. మరీ ఎంత కల్తీ చేసినా గానీ ఆ ఉత్పత్తికి సంబంధించిన వస్తువు అయితే అందులో ఉండాలి కదా. మ్యాంగో జ్యూస్ తయారీ అంటే మామిడి పండ్లు ఉండాలి కదా. కానీ ఆ మామిడి పండ్లే లేకుండా మామిడి రసాలు అమ్ముతున్నారు.

  • Published Aug 31, 2024 | 11:48 AMUpdated Aug 31, 2024 | 11:48 AM
మ్యాంగో జ్యూస్ కాదు విషం.. ఈ కంపెనీ ఉత్పత్తులు కొంటున్నారా? జాగ్రత్త

వేసవి కాలంలో మాత్రమే దొరికే మామిడి పండ్ల రుచిని ఏడాది మొత్తం ఆస్వాదించమని పలు ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి. నిజంగానే వారికి ఏడాదికి సరిపడా మామిడి పండ్లు దొరుకుతున్నాయా? మామిడి పండ్లతోనే మ్యాంగో జ్యూస్ ని తయారు చేస్తున్నారా? మొత్తం అన్ని కంపెనీలు నిజాయితీగా వ్యవహరిస్తున్నాయా అంటే చెప్పలేము గానీ ఓ కంపెనీ మాత్రం మ్యాంగో జ్యూస్ కోసం మామిడి పండ్లను వాడడం లేదు. సింపుల్ గా మ్యాంగో జ్యూస్ లా కనిపించడం కోసం కొన్ని రసాయనాలను, రంగులను కలుపుతున్నారు. ఒక కంటెంట్ క్రియేటర్ ఇటీవల ఒక కంపెనీకి సంబంధించిన మ్యాంగో జ్యూస్ తయారీ వీడియోను షేర్ చేశాడు.

మ్యాంగో జ్యూస్ ప్రాసెస్ చేసే ప్లాంట్ కి చెందిన తయారీ విధానాన్ని ఒక వీడియోలో చిత్రీకరించి దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. గుండ్రంగా తిరిగే ఒక మెషిన్ లో పసుపు రంగు ద్రవ పదార్థాన్ని ఎరుపు, ఆరెంజ్ ఫుడ్ కలర్స్ తో మిక్స్ చేసి.. ఇతర రసాయనాలు, పంచదార కలుపుతారు. అది మ్యాంగో జ్యూస్ రంగులోకి మారిపోతుంది. ఆ జ్యూస్ ని ప్లాస్టిక్ పేపర్ ప్యాకెట్స్ లో నింపుతారు. ఆ తర్వాత ఆ ప్యాకెట్స్ ని ఒక కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి వర్కర్స్ చేత సెల్లర్స్ కి పంపిస్తారు. టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ అంటూ వీడియోని షేర్ చేసిన వ్యక్తి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తయారీ విధానాన్ని, ప్రాసెసింగ్ ప్రక్రియను చూసిన అనంతరం నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇంతకి దిగజారతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాకి థాంక్స్ చెప్పాలి. రుచికరమైన డ్రింక్స్ లను తాగడం మానేశా. ఈ రుచికరమైన 200 శాతం ఫ్రూట్ జ్యూస్ లను ఇకపై తాగను. అంతేకాదు కోకోబార్ లాంటి ఉత్పత్తులను కూడా తాగడం మానేశా. ట్యాప్ వాటర్, విస్కీ, వైన్ తాగుతా.. సోషల్ మీడియాని దేవుడు ఆశీర్వదించాలి. నేను నిజంగా కొన్ని భయంకరమైన కొన్ని అంశాలను చూశాను అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ మ్యాంగో పల్ప్ ఏది అంటూ కామెంట్ చేశాడు. మ్యాంగో తప్ప అన్నీ ఉన్నాయంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదో స్లో పాయిజన్.. వారి వెనుక ప్రభుత్వం ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. బాబోయ్ ఇక నుంచి నేను స్టోర్ లో మ్యాంగో జ్యూస్ లు కొనను.. ఇంట్లో చేసుకుని తాగుతాను అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.     

 

View this post on Instagram

 

A post shared by YOUR BROWN ASMR (@yourbrownasmr)