హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ రద్దుపై నిర్మలా సీతారామన్ క్లారిటీ

Nirmala Sitharaman Clarity On Removal Of GST On Health and Life Insurance: సామాన్యులకు కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇప్పటివరకూ భారం తగ్గుతుందనుకున్న సామాన్యుల ఆశలు నిరాశ అయ్యాయి. ఇకపై భారం తప్పదని నిర్మలా సీతారామన్ తేల్చేశారు.

Nirmala Sitharaman Clarity On Removal Of GST On Health and Life Insurance: సామాన్యులకు కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇప్పటివరకూ భారం తగ్గుతుందనుకున్న సామాన్యుల ఆశలు నిరాశ అయ్యాయి. ఇకపై భారం తప్పదని నిర్మలా సీతారామన్ తేల్చేశారు.

2024-25 వార్షిక బడ్జెట్ లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, పలు ఉత్పత్తులపై పన్ను వంటి అంశాల విషయంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొంతమందికి ఊరట కలిగించగా మరికొంతమందికి మాత్రం భారం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం మరో షాకిచ్చింది. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ రద్దు అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి స్పందించారు. జీఎస్టీ రద్దు ఉండదని.. ఇకపై కొనసాగుతుందని అర్థమొచ్చేలా మాట్లాడారు. దీంతో సామాన్యులకు భారం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

హెల్త్ ఇన్సూరెన్స్ పై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్పందించారు. లోక్ సభ లో జరిగిన చర్చలో భాగంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆరోగ్య మరియు జీవితా బీమాల మీద జీఎస్టీ తొలగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాసిన లేఖ గురించి ప్రతిపక్షాలు ఉటంకిస్తూ జీఎస్టీ తొలగింపుపై ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ జవాబిచ్చారు. ఆ లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ లో 200 ఎంపీలు హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. ఐతే తాను రెండు ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతానని అన్నారు. జీఎస్టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ అనేది ఉందని ఆమె అన్నారు. జీఎస్టీ తీసుకురాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద ప్రీ-జీఎస్టీ ట్యాక్స్ ఉందని ఆమె వెల్లడించారు. ఇదేమీ కొత్త సమస్య కాదని.. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉందని అన్నారు. ఈ నిరసన చేసేవాళ్ళు ట్యాక్స్ తొలగించాలని వారి రాష్ట్రాల్లో చర్చించారా అంటూ ప్రశ్నించారు.    

లైఫ్ ఇన్సూరెన్స్ లు, హెల్త్ ఇన్సూరెన్స్ ల మీద ప్రీమియం లు చెల్లించే వారి మీద జీఎస్టీని ఉపసంహరించుకోవాలని నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కోరారు. బీమా సంస్థలపై పన్ను భారం తగ్గించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో బీమా ఉత్పత్తులను పెంచాలని కోరారు. నాగ్ పూర్ ఎల్ఐసీ యూనియన్ తరపున నితిన్ గడ్కరీ ఈ అంశం గురించి నిర్మలా సీతారామన్ కి ఒక లేఖ రాశారు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పరోక్షంగా పన్ను విధించడం అనేది జీవిత అనిశ్చితిపై పన్ను విధించడం వంటిదని పేర్కొన్నారు. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తివేయాలని నాగ్ పూర్ డివిజనల్ ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ తనను కోరారని నితిన్ గడ్కరీ లేఖలో పేర్కొన్నారు. భారతదేశంలో ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ నిధుల ఆస్తుల విలువ జీడీపీలో 19%, 5% గా మాత్రమే ఉన్నాయని.. మిగతా దేశాల్లో ఎక్కువగా ఉన్నాయని అన్నారు. యూఎస్ఏలో ఇన్సూరెన్స్ 52%, పెన్షన్ 122% ఉన్నాయని.. యూకేలో 112%, 80 శాతంగా ఉన్నాయని అన్నారు.

జీఎస్టీ తొలగిస్తే మన దేశంలో కూడా ఈ బీమాల వృద్ధి అనేది ఉంటుందన్న విషయాన్ని హైలైట్ చేశారు. ఆర్థిక నివేదిక ప్రకారం.. ఇన్సూరెన్స్ షేర్ అనేది జీడీపీలో 2023 ఆర్థిక ఏడాదిలో 3.8 శాతం నుంచి 2035 ఆర్థిక ఏడాది నాటికి 4.3 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది. 2024 నుంచి 2028 వరకూ 6.7% వార్షిక రేటు చొప్పున లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వృద్ధి పెరుగుతుందని అంచనా. జీవిత బీమా ద్వారా పొదుపుకి అవకాశం కల్పించడం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద పన్ను మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టడం, పబ్లిక్ మరియు సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఏకీకృతం చేయడం వంటి అంశాల గురించి నితిన్ గడ్కరీ లేఖలో లేవనెత్తారు. ఆరోగ్య మరియు జీవిత బీమాలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని నిర్మలా సీతారామన్ ను నితిన్ గడ్కరీ అభ్యర్థించారు. ఈ లేఖ గురించి ప్రస్తావిస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాలు జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందిస్తూ జీఎస్టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు.   

Show comments