మెట్రో ట్రైన్ ఎక్కిన లంబోధరుడు!

భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సాంప్రదాయంగా పదిరోజుల పాటు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు. లంబోధరుడిని వాడ వాడలా ఊరేగించి నిమజ్జనం చేస్తుంటారు. గత కొంతకాలంగా వినాయక ప్రతిమలు ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రయాన్ – 3, ఇండిగో విమానం, అయోద్య రామమందిరం ఇలా ఎన్నో రకాలుగా మండపాలను అలంకరిస్తున్నారు భక్తులు. తాజాగా ఏకదంతుడు వందేభారత్ రైల్ ఎక్కాడు. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు జరుపుకుంటున్నారు. భక్తులు తమ ఇళ్లల్లో గణేషుడి ప్రతిమను ప్రతిష్టించి పూజించుకుంటున్నారు. గల్లీ గల్లీలో వెరైటీల మండపాలు ఏర్పాటు చేసి గణనాథుడిని ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తూ పరవశించిపోతారు భక్తులు. ఏ ఏడాదికి ఆ ఏడాది ట్రెండ్ కి తగ్గట్టుగా లంబోధరుడి ప్రతిమలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల భక్తులు తమ క్రియేటివిటీనీ ప్రదర్శిస్తు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సంవత్సరం అయోద్య రామమందిరం, చద్రయాన్ – 3, ఇండిగో విమానం థీమ్ ‌తో  వెరైటీ మండపాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వందేభారత్ రైల్లో ఎక్కాడు వినాయకుడు. అదేంటీ వినాయకుడిని నిమజ్జనానికి మెట్రోలో తరలిస్తున్నారని అనుకుంటున్నారా? అబ్బే ఓ భక్తుడి క్రియేటివిటీ.

ప్రతి సంవత్సరం ముంబైలో వినాయక చవితి వేడుకులు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో రాహూల్ అనే భక్తుడు అచ్చం మెట్రోట్రైన్ థీమ్ ఆధారంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. రాహూల్ వరియా తమ ఇంట ఏకదంతుడిని మెట్రో ట్రైన్ ఎక్కించాడు. ఈ వెరైటీ ముంబై నగర రవాణా వ్యవస్థకు కృతజ్ఞతగా ఏర్పాటు చేసినట్లు రాహుల్ అంటున్నాడు. ఈ గణపతి విగ్రహాన్ని న్యూస్‌ పేపర్లు, పేపర్‌ స్ట్రాలు, సన్‌బోర్డు తో తయారు చేసినట్లు రాహూల్ తెలిపాడు. ఈ వెరైటీ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Show comments