Keerthi
ఇటీవల కాలంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరు ఆన్ లైన్ ఫుడ్ కు అలావాటు పడ్డారు. నిమిషాల వ్యవధిలో వచ్చే ఈ ఆన్ లైన్ ఫుడ్ ను తినాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ వ్యక్తి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ తెరిచి చూస్తే ఊహించని షాక్ కు గురైయ్యాడు.
ఇటీవల కాలంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరు ఆన్ లైన్ ఫుడ్ కు అలావాటు పడ్డారు. నిమిషాల వ్యవధిలో వచ్చే ఈ ఆన్ లైన్ ఫుడ్ ను తినాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ వ్యక్తి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ తెరిచి చూస్తే ఊహించని షాక్ కు గురైయ్యాడు.
Keerthi
ప్రస్తుత కాలంలో అందరూ బిజీ లైఫ్ ని గడపడటం వల్ల అంతా ఆన్ లైన్ ట్రెండ్ నడుస్తోంది. నిత్యవసర వస్తువుల నుంచి దుస్తుల వరకు ప్రతిది ఇంట్లో నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో వంట చేసుకునే సమయం లేనివారు సైతం ఆన్ లైన్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. కూర్చున్న చోటుకే ఫుడ్ వస్తుండడంతో.. ప్రతిఒక్కరు ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇక రెస్టారెంట్స్ కి, హోటల్స్ కి వెళ్లాల్సిన పని లేకుండా.. క్షణాల్లో మనకు ఇష్టమైన ఫుడ్ మన ఎదురుగా ఉంటుంది. కాగా, గడప దాటి బయటకు వెళ్లసిన పని కూడా లేదు.
ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో.. అటు ఇంట్లో నుంచి ఆఫీసు వరకు ఎప్పుడైనా, ఎక్కడైనా సింపుల్ గా ఆర్డర్ పెట్టేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ విషయంలో అనుకోని అపశృతులు జరుగుతూ ఉంటాయి. ఇటీవలే బిర్యానీలో బల్లి, జలగ రావడం వంటి సంఘటనలు జరగడం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టగా అందులో ట్యాబ్లెట్స్ దర్శనమిచ్చాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..
పండగల సమయంలో కస్టమర్లను ఆకర్షించుకోవడానికి స్విగ్గీ వంటి సంస్థలు రకరకాల ఆఫర్స్ ను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో నే ముంబైకి చెందిన ఉజ్వల్ అనే వ్యక్తికి క్రిస్‌మస్ సందర్భంగా అతనికి ఇష్టమైన రెస్టారెంట్ అయిన ఐకానిక్ లియోపాల్ల్ కేఫ్ నుంచి చికెన్ ఓయ్‌స్టర్ సాస్‌ను ఆర్డర్ చేశాడు. అలా ఆర్డర్ పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలో ఫుడ్ పార్సిల్ ఉజ్వల్ కు దగ్గరకు చేరింది. దీంతో అలస్యం చేయకుండా వెంటనే ఆ పార్సిల్ ను ఓపెన్ చేసి తిందమనుకున్నా ఉజ్వల్ కు ఒక్కసారిగా షాక్ గురైయ్యాడు. ఎందుకంటే ఆ పార్సిల్ లో ఆహారంతో పాటు ఓ ట్యాబ్లెట్ కూడా ఉంది. ఇక అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ స్ట్రిప్ లో మరో ట్యాబ్లెట్ పూర్తిగా ఉడికినట్లు ఉండటం గమనార్హం. వెంటనే ఆ పార్సిల్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన ఎక్స్ ఖాతలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఉజ్వల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అలాగే ఉజ్వల్ ఈ విషయాన్ని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి తెలిపాడు. దీంతో వెంటనే ఈ విషయం పై స్విగ్గీ స్పందిచింది. మా ప్రతినిధులు నేరుగా మీతో కాంటాక్ట్ అవుతామని తెలిపింది. కాగా, చికెన్‌లో ట్యాబ్లెట్స్ వచ్చిన ఆ ఫొటోను చూసిన నెటిజన్లు ఇక నుంచి ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి, స్విగ్గీ బిర్యానిలో ఆ వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.