iDreamPost
android-app
ios-app

తొమ్మిదో తరగతి ఫెయిల్.. యూట్యూబ్ చూసి ఎంత పనిచేశాడంటే!

  • Published May 18, 2024 | 3:37 PM Updated Updated May 18, 2024 | 3:37 PM

Mumbai Fake Currency Notes: ఇటీవల కొంతమంది డబ్బు కోసం ఎన్నో దారుణాలు, మోసాలకు పాల్పడుతున్నారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని చెలామణి చేస్తూ జల్సా చేస్తున్నారు.

Mumbai Fake Currency Notes: ఇటీవల కొంతమంది డబ్బు కోసం ఎన్నో దారుణాలు, మోసాలకు పాల్పడుతున్నారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని చెలామణి చేస్తూ జల్సా చేస్తున్నారు.

తొమ్మిదో తరగతి ఫెయిల్.. యూట్యూబ్ చూసి ఎంత పనిచేశాడంటే!

ఈ మధ్య చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో తప్పులు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే తపనతో చేయకూడని తప్పులు చేస్తున్నారు. అదృష్టం కలిసి వస్తే కోటీశ్వరులు అవుతున్నారు.. లేదంలో పోలీసులకు బుక్కవుతున్నారు. నేరం చేసిన వాళ్లు ఎప్పటికైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్ని ఎన్నోసార్లు రుజువైంది. కొంతమంది పై సినిమాల ప్రభావం బాగా చూపిస్తుందని అంటుంటారు. ఆ మధ్య షాహిద్ కపూర్ నటించిన ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ చూపి కొంతమంది 2000 నోట్లు ముద్రించి పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. మరికొంతమంది యూట్యూబ్ చూసి దొంగనోట్లు ముద్రిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహరాష్ట్ర థానేకు చెందిన ఓ యువకుడు నకిలీ నోట్లు ముద్రిస్తు పోలీసులకు చిక్కాడు. కేసు విచారణలో ఆ యువకుడు చెప్పిన మాటలు విని పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తాను యూట్యూబ్ లో వీడియోలు చూస్తు దొంగనోట్లు ఎలా ముద్రించాలో నేర్చుకున్నాని పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం నిందితుడి నుంచి రెండు లక్షలకు పైగా నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌గఢ్ పన్వేల్ తాలూకు చెందిన ప్రపుల్ల గోవింద్ పాటిల్ (26) ముంబైలోని తలోజా ప్రాంతంలో నివసిస్తున్నాడు. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

నిందితుడు ప్రపుల్లా పాటిల్ మాట్లాడుతూ.. ‘ఆర్థిక సమస్యల వల్ల నేను ఈ పని చేశాను.. తక్కువ రోజుల్లో ఎక్కవ డబ్బు సంపాదించాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్నా. కుటుంబానికి దూరంగా ఉంటూ దొంగనోట్ల ముద్రించడం మొదలు పెట్టా. మార్కెట్ లో నేను ముద్రించిన దొంగనోట్లు కొన్ని చెలామని అయ్యాయి. దీంతో మరిన్ని దొంగనోట్లు తయారు చేశాను. కానీ నా దృరదృష్టం కొద్ది ఓ షాపు ఓనర్ కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు’ అని అన్నారు. ప్రపుల్లా పాటిల్ నుంచి రూ.10,20,50,100,200 నోట్లు ముద్రించా రూ.1443 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగు నెలలుగా దొంగనోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఎన్ని నోట్లు చలామణిలోకి వచ్చాయన్న కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు.