iDreamPost
android-app
ios-app

వీడియో: రూ. 20 వేలతో బైక్ కొని.. 60 వేలతో భారీ ఊరేగింపు.. పోలీసుల ఎంట్రీతో..

ఓ వాహనదారుడు 20 వేలతో బైక్ కొని 60 వేలతో ఊరేగింపు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చారు.

ఓ వాహనదారుడు 20 వేలతో బైక్ కొని 60 వేలతో ఊరేగింపు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చారు.

వీడియో: రూ. 20 వేలతో బైక్ కొని.. 60 వేలతో భారీ ఊరేగింపు.. పోలీసుల ఎంట్రీతో..

నేటి రోజుల్లో టూవీలర్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, కాలేజ్ స్టూడెంట్స్ తమ తమ అవసరాల కోసం బైక్ లను యూజ్ చేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా టక్కున గుర్తొచ్చేది బైక్ మాత్రమే. బైక్ కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమ కలల బైక్ కొనుక్కోని రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాలని భావిస్తుంటారు. అందుకోసం సరిపడా పైసలు కూడబెట్టుకుని బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. తమకు ఇష్టమైన బైక్ కొనుకున్నాక వారి ఆనందానికి హద్దే ఉండదు. స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. పండగల సందర్భంగా బైక్ కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పండగ వేళ కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఫెస్టివల్ కి టూవీలర్ కంపెనీలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అందుకే పంగలప్పుడు బైకు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. దసరా పండక్కి కూడా చాలా మంది బైక్ లను కొనుగోలు చేశారు.

తమకు నచ్చిన బైకును కొని ఇంటికి తెచ్చుకున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బైక్ కొని ఇప్పటి వరకు ఎవరూ చేసుకోని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. రూ. 20 వేలతో బైక్ కొనుగోలు చేసి ఏకంగా 60 వేలతో బరాత్ నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఆ వాహనదారుడికి అంతలోనే పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో టీ స్టాల్‌ నడుపుతున్న ఓ వ్యక్తి మొపెడ్ కొనుగోలు చేశాడు. బండి ఖరీదు రూ. 90,000. అయితే అతడు 20 వేలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది బ్యాంక్‌ లోన్‌ తీసుకుని బైక్‌ కొనుగోలు చేశాడు. కొత్త బండి కొన్న సంతోషాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాడు.

బండిని షో రూమ్ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంటికి తీసుకొచ్చే క్రమంలో అతడు..భారీ బ్యాండ్‌ బాజా ఏర్పాటు చేశాడు. సుమారుగా రూ. 60,000 వరకు ఖర్చు చేసి ఆ బైక్‌కు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో డీజే పాటలు, గుర్రపు బండిని ప్రదర్శించారు. కొత్తగా కొన్న మోపెడ్‌ను క్రేన్‌కు కట్టి నడిపించారు. అయితే ఆ ఊరేగింపులో డీజే సౌండ్స్‌ పెట్టేందుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఎంట్రీతో ఊరేగింపు వాతావరణం తలకిందులైంది.

పర్మిషన్‌ లేకుండా డీజే ఏర్పాటు చేయటంతో పోలీసులు డీజేను సీజ్ చేశారు. ఊరంతా చెప్పుకునేలా గొప్పగా సంబరాలు జరుపుకున్నాడు. కానీ, అంతలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇది తెలిసిన నెటిజన్స్ సంబరాలు హద్దు దాటితే ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. బండికి ఊరేగింపు చేసుకోవడంలో తప్పు లేదు కానీ, రూల్స్ అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మోపెడ్ బైక్ కు ఊరేగింపు చేసి కేసులపాలైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.