nagidream
తల్లిదండ్రులు లెక్చరర్స్ అయితే పిల్లలు చదివే స్కూల్ కి లేదా కాలేజ్ కి వెళ్తారు. కానీ లెక్చరర్ కాకపోయినా ఒక తల్లి మాత్రం రోజూ కూతురు చదివే కాలేజ్ కి వెళ్తుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
తల్లిదండ్రులు లెక్చరర్స్ అయితే పిల్లలు చదివే స్కూల్ కి లేదా కాలేజ్ కి వెళ్తారు. కానీ లెక్చరర్ కాకపోయినా ఒక తల్లి మాత్రం రోజూ కూతురు చదివే కాలేజ్ కి వెళ్తుంది. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
nagidream
అబ్బాయిలని కాలేజ్ లో జాయిన్ చేస్తే సక్రమంగా చదువుతున్నాడా లేదా అని తల్లిదండ్రులకి అనుమానం వస్తుంది. ఏ పిల్ల వెంటయినా పడుతూ చదువుని పక్కన పెట్టేస్తాడేమో? ఫ్రెండ్స్ తో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ చదువుని గాలికి వదిలేస్తాడేమో అని భయపడుతుంటారు. ఇక అమ్మాయిల గురించి అయితే తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. వాళ్ళు ఎవరినైనా లవ్ చేస్తారేమో.. లవ్ లో పడి లేనిపోని పంచాయితీలు ఇంటికి తెస్తారేమో అని టెన్షన్. ఏ కుర్రాడితో అయినా లొల్లి అవుతాదేమో.. లేదంటే ఏ కుర్రాడైనా వెంటపడి వేధిస్తాడేమో అన్న భయం ఉంటుంది. దీంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పుడప్పుడూ కాలేజీలకు వెళ్తుంటారు. వాళ్ళ పిల్లల మీద నిఘా పెడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే తల్లి కూడా తన కూతురు చదివే కాలేజీకే వెళ్తుంది. డైలీ కూతురు కాలేజీకి వెళ్తుంది. అలా అని ఆమె ఏమీ లెక్చరర్ కాదు.
ఆమె పేరు శకున్ విశ్వకర్మ. ఈమె మధ్యప్రదేశ్ లో ఉంటుంది. స్థానికంగా ఉండే మాల్తాన్ కాలేజీలో ఆమె కూతురు బీఎస్సీ చదువుతుంది. అదే కాలేజీలో శకున్ బీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తల్లీకూతుర్లు ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తుంటారు. 25 ఏళ్ల తర్వాత ఆమె 40 ఏళ్ల వయసులో చదువు పూర్తి చేస్తుంది. శకున్ పుట్టిన ఊరిలో ఉన్న స్కూల్లో ఐదో తరగతి వరకే ఉంది. దీంతో ఆమె ఐదో తరగతితో చదువు ఆపేసింది. 1992లో ఐదో తరగతితో చదువు ఆపేసిన శకున్ కి 2004లో పెళ్లయ్యింది. అయితే పెళ్లయ్యాక చదువుకోవాలన్న కోరిక పుట్టింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. 2017లో ఆమె తన కూతురితో పాటు 8వ తరగతిలో చేరింది. అలా ఇద్దరూ కలిసి చదువుతూ వచ్చారు. కూతురు చదువు విషయంలో తల్లికి ఎంతో సహకరించేది. దీని వల్ల ఆమె కూతురితో పాటు పాసయ్యేది.
ప్రస్తుతం ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ పూర్తయ్యాక కూడా ఇంకా తన చదువును కొనసాగిస్తానని శకున్ చెబుతుంది. శకున్ కూతురు అను విశ్వకర్మ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అమ్మ తనకంటే చాలా తెలివైనదని.. చాలా బాగా చదువుతుందని అను తెలిపింది. తన తల్లికి చదువు విషయంలో సహాయం చేస్తానని చెప్పుకొచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యుల సపోర్ట్ తో ఆమె 8,10,12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. అది కూడా ఒక పక్క ఇంట్లో పనులు చేస్తూనే రెగ్యులర్ స్టూడెంట్ గా చదువుతూ మంచి మార్కులు సాధించింది. తనకు చదువు విలువ తెలుసునని.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నా అని శకున్ విశ్వకర్మ తెలిపింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఆ తల్లి పట్టుదలకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ వయసులో ఆమె పట్టుదల చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని.. విద్యార్థులు ఆమెను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.