iDreamPost

కోటిన్నర విలువైన బెంజ్ కారును సీజ్ చేసిన పోలీసులు.. ఈ తప్పు చేస్తే మీ కారు కూడా..

1.5 కోట్లు విలువ చేసే అత్యంత విలువైన కారును ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. దీనికి గల కారణం తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ కారును ఎందుకు సీజ్ చేశారంటే?

1.5 కోట్లు విలువ చేసే అత్యంత విలువైన కారును ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. దీనికి గల కారణం తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ కారును ఎందుకు సీజ్ చేశారంటే?

కోటిన్నర విలువైన బెంజ్ కారును సీజ్ చేసిన పోలీసులు.. ఈ తప్పు చేస్తే మీ కారు కూడా..

ఇటీవలి కాలంలో ట్రాఫిక్ అధికారులు ప్రమాదాల నివారణకు, వాహనదారుల సేఫ్ డ్రైవింగ్ కోసం కఠినమైన నిబంధనలను తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించే వారికి భారీగా జరిమానాలను విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారు కొందరు వ్యక్తులు. వాహనం ఏదైనా సరే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అన్ని డాక్యూమెంట్స్ ఉండాల్సిందే. ముఖ్యంగా వాహనానికి సంబంధించి నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకపోయినా.. నకిలీ నెంబర్ ప్లేట్స్ ఉపయోగించినా చట్టరీత్యా నేరం. ఈ క్రమంలో రూ. 1.5 కోట్లు విలువ చేసే కారును సీజ్ చేశారు పోలీసులు. కారణం ఏంటంటే?

కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు, కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యూమెంట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా కనిపించే కార్లను ట్రాఫిక్ అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత సదరు వాహనదారుడు తప్పకుండా భారీమొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 1.5 కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ కారు నెంబర్ ప్లేట్ లేని కారణంగా సీజ్ చేయబడింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా కారును నడుపుతున్న డ్రైవర్‌ను పోలీసులు కారణం అడగగా అతడు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

కారును స్వాధీనం చేసిన తరువాత పోలీసులు దాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ కారు ధర మార్కెట్లో సుమారు రూ. 1.54 కోట్లుగా ఉంది. ఇంత ఖరీదైన కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు నడుపుతున్నారు అనే విషయాలు వెల్లడికాలేదు. ఈ ఘటన ఒడిశాలో జరిగినట్లు తెలుస్తోంది. అక్కడి ట్రాఫిక్ ఏసీపీ జయంత్ దొర స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడిపితే సీజ్ చేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనాలను నడపవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. ఇటీవ నెంబర్ ప్లేట్ లేని కారణంగా పట్టబడిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి