iDreamPost
android-app
ios-app

అయోధ్య ప్రారంభోత్సవ వేళ గర్భిణీల కొత్త కోరిక!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ మందిర ప్రారంభోత్సవంపైనే చర్చ జరుగుతోంది. మరో 15 రోజుల్లో అయోధ్య గర్భగుడిలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో గర్భిణీలు కొత్త కోరిక కోరుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ మందిర ప్రారంభోత్సవంపైనే చర్చ జరుగుతోంది. మరో 15 రోజుల్లో అయోధ్య గర్భగుడిలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో గర్భిణీలు కొత్త కోరిక కోరుతున్నారు.

అయోధ్య ప్రారంభోత్సవ వేళ గర్భిణీల కొత్త కోరిక!

అయ్యోధ్య రామమందిర నిర్మాణం అనేది హిందూవుల చిరకాల కోరిక. ఈ నిర్మాణం కోసం కోట్లాది మంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆకలలు మరికొద్ది రోజులో నిజంగా కానున్నాయి. జనవరి 22న ఆయోధ్య రామ మందిర ప్రారంభం కానుంది. ఈ వేడుకను చూసేందుకు దేశం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని గర్బిణీలు కొత్త ఆశతో ఉన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజే తాము ప్రసవించాలని భావిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లి.. తమకు జనవరి 22 వ తేదీనే ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని  సదరు గర్భిణీలు కోరుతున్నారు.

అయోధ్యలో జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు గర్బ గుడిలో రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ  అద్భుత వేడుకని ఎదురు చూస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు వేల మంది అతిథులకు ఆహ్వానాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను ఈ కార్యక్రామానికి ఆహ్వారనించారు. అంతేకాక సాధువులు, స్వామీజీలు కూడా వేడుకలకు హాజరుకానున్నారు.

అయోధ్యలో రాములోరి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 22 వ తేదీన రాములు వారి ప్రాణ ప్రతిష్ఠాతో ముగుస్తుంది. ఇక ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశమే కాకుండా విదేశాల్లోని హిందువులు కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గర్భిణీలు కొత్త కోరిక ఉన్నారు. రామమందిర ప్రారంభోత్సవం రోజే తాము ప్రసవించాలని భావిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లి.. తమకు ఈనెల22 వ తేదీనే ఆపరేషన్లు చేసి బిడ్డలను జన్మనిచ్చేలా కోరుతున్నారు. అలానే యూపీలోని చాలా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులకు.. గర్భిణీల నుంచి కొత్త రకమైన వినతులు వస్తున్నాయి.

తమకు రామ మందిర ప్రారంభోత్సవం జరిగే జనవరి 22 వ తేదీన ఆపరేషన్లు నిర్వహించాలని కోరారు.  ఆవిధంగానే తమ బిడ్డలకు జన్మనిచ్చేలా చూడాలని కోరుకుంటున్నారు. నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారు కూడా తమ డెలివరీ తేదీని ఈనెల22 వ తేదీ వరకు ఆపాలని విన్నవిస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీ వరకు నెలలు పూర్తిగా నిండని గర్భిణీ కూడా అదే విధంగా కోరుతున్నారు. జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని వేడుకుంటున్నారు. మరి.. యూపీ గర్భిణీల ఈ కొత్త కోరికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి