P Krishna
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీరామ నామం జపిస్తున్నారు. అయోధ్యలో ఏర్పాటు చేసిన రామ మందిరంలో నేడు బాల రాముని ప్రతిష్టించబోతున్న విషయం తెలిసిందే.
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీరామ నామం జపిస్తున్నారు. అయోధ్యలో ఏర్పాటు చేసిన రామ మందిరంలో నేడు బాల రాముని ప్రతిష్టించబోతున్న విషయం తెలిసిందే.
P Krishna
జగదాభిరాముడు జన్మస్థలమైన అయెధ్యలో రామ మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. నేడు రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ట సంరద్భంగా దేశ వ్యాప్తంగా రామనామ స్మరరణతో మార్మోగుతుంది.. ఎక్కడ చూసినా రామజపమే వినిపిస్తుంది. ఆలయ నిర్మాణానికి వివిధ రాష్ట్రాల కళాకారులు, కార్మికులు పాలు పంచుకున్నారు. స్వామి వారికి దేశ, విదేశాల నుంచి ఎన్నో అపురూపమైన కానుకలు వచ్చాయి. నేటి తో 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపబడుతుంది. అయోధ్యకు ప్రముఖులు బయలుదేరి వెళ్లారు.. వేల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా ప్రారంభోత్సవ వేడుకలను తిలకించనున్నారు. ఇంత గొప్ప ఆలయంలో పూజారి ఎవరు అన్న విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో నేడు రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరగనుంది. అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభతో కళ కళలాడిపోతుంది. ఈ ఆలయానికి పూజారి ఎవరు అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న ఘజియాబాద్ లో దుధేశ్వర్ నాథ్ ఆలయంలో వేద్ విద్యాలయంలోని పాత విద్యార్థి మోహిత్ పాండే.. అయోధ్య రామాలయానికి పూజారిగా ఎంపికయ్యాడు. దుధేశ్వర వేద విద్యాపీఠ్ లో ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న మోహిత్.. తర్వాత తిరుపతిలో తదుపరి శిక్షణ పూర్తి చేశాడు.
2002, నవంబర్ 10న చసీతాపూర్ లో బెల్హౌరాలో జన్మించాడు మోహిత్. తన మామయ్య నుంచి ప్రేరణ పొందిన మెహిత్ ఏడేళ్ల పాటు మతం, ఆచారాలతో పాటు సంవేదాన్ని కూడా అభ్యసించాడు. తిరుపతిలోని వెంకటేశ్వర వేద పాఠశాలలో విద్యను పూర్తి చేసి రామ మందిరంలో పూజారిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మోహిత్ పాండే అర్హతలు చూసి ఎంపికయ్యాడు. చిన్న వయసులోనే మోహిత్ పాండకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామ మందిరంలో పూజారిగా నియమించబడ్డారు. కాగా, అయోధ్య రామమందిరంలో పూజారుల పోస్టులకు 3 వేల మంది ఇంటర్వ్యూ చేయగా.. అందులో ఈ స్థానానికి ఎంపికైన వారు 50 మందిలో మోహిత్ పాండే ఎంపికయ్యారు. పూజారి నియామకం ముందు ఇక్కడ పద్దతులు నేర్పించి, ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. నెలకు వేతన 32,900 అని తెలుస్తుంది. రూపాయిలు తనకు అయోధ్య మందిరంలో పూజారిగా స్థానం దక్కినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.