Madhya Pradesh Minister: మీ భర్తలు మద్యం తాగుతున్నారు..ఇలా చేస్తే మానేస్తారు: రాష్ట్ర మంత్రి టిప్స్ వైరల్‌!

మీ భర్తలు మద్యం తాగుతున్నారు..ఇలా చేస్తే మానేస్తారు: రాష్ట్ర మంత్రి టిప్స్ వైరల్‌!

Madhya Pradesh Minister: నేటికాలంలో యువతను మొదలుకుని వృద్ధుల వరకు చాలా మంది మద్యానికి బానిసలు అవుతున్నారు. ఇక ఏదైనా శుభకార్యం జరిగితే.. అక్కడ మద్యం తప్పని సరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో మద్యం మానిపించేందుకు ఓ రాష్ట్ర మంత్రి టిప్స్ ఇచ్చారు.

Madhya Pradesh Minister: నేటికాలంలో యువతను మొదలుకుని వృద్ధుల వరకు చాలా మంది మద్యానికి బానిసలు అవుతున్నారు. ఇక ఏదైనా శుభకార్యం జరిగితే.. అక్కడ మద్యం తప్పని సరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో మద్యం మానిపించేందుకు ఓ రాష్ట్ర మంత్రి టిప్స్ ఇచ్చారు.

నేటికాలంలో మదయ్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. యువతను మొదలుకుని వృద్ధుల వరకు చాలా మంది మద్యానికి బానిసలు అవుతున్నారు. ఇక ఏదైనా శుభకార్యం జరిగితే.. అక్కడ మద్యం తప్పని సరిగా ఉండాల్సిందే. అలానే వీకెంట్ వస్తే.. చాలు మందుతో మునిగి తేలుతుంటారు. ఇంకొందరికి అయితే నోట్లో చుక్కపడనిదే.. రోజు ప్రారంభం కాదు. ఇక ఇలాంటి వారి విషయంలో వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన చెందుతుంటారు. మద్యాన్ని మాన్పించేందుకు  ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఓ మంత్రి  మహిళకు టిప్స్ ఇచ్చారు. ఇలా చేస్తే.. మీ భర్తలు మద్యం తాగడం మానేస్తారంటూ కొన్న సలహాలు ఇచ్చాడు. ప్రస్తుతం మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఆ మంత్రి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు అక్కడ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈక్రమంలోనే అనేక ప్రజలకు మద్యం వల్లే జరిగే నష్టాల గురించి ప్రజలకు వివరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా ప్రజలకు ఓ సూచన చేశారు. చాలా మంది ఇంట్లలోని భర్తలు, మగవారు మద్యం తాగుతున్నారని తెలిపాడు. వారు మద్యం మానేయాలంటే..మహిళలు ఓ టిప్ పాటించాలనే సూచించాడు.

తమ ఇంట్లోని మగవారు మద్యం మానేయాలని మహిళులు కోరుకుంటే.. ముందుగా వారిని బయట తాగి రావద్దని  చెప్పండని తెలిపారు. ఆ బయట తాగేది ఏదో ఇంటికి తెచ్చుకొని, మీ ముందే కూర్చొని తాగమని చెప్పండని మంత్రి అన్నారు. అలా కుటుంబసభ్యుల ముందు మద్యం సేవిస్తే.. వారిలో పశ్చాత్తాపం మొదలై ఆ అలవాటు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపాడు.  ఆ తరువాత కొంతకాలానికి పూర్తిగా మద్యం మానేస్తారని సూచించాడు. తమ భార్యాపిల్లల ముందు మద్యం తాగడానికి వాళ్లు సిగ్గుపడతారుని, పిల్లలు చూస్తే వాళ్లు కూడా అలాగే ప్రవర్తించే ప్రమాదం ఉంటుందని ఇంట్లోనే భర్తలకు గుర్తుచేయాలని సూచించారు. అలా ఈ టిప్ పాలో అయితే  ఇంట్లోనే మగవారు మద్యం పూర్తిగా మనేస్తారని మంత్రి అన్నారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా సూచనలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ చెప్పే విధానం సరిగాలేదని విమర్శించింది. అయితే ఆయన వ్యాఖ్యలను సొంత పార్టీ వారు సమర్ధించారు. మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, నివారణగా తమ ప్రభుత్వం చర్యలు చెప్పటిందని, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం విజయవంతగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments