iDreamPost
android-app
ios-app

వీడియో : ఓరి దేవుడా.. మురికి కాలువలో వేల సంఖ్యలో పాల ప్యాకెట్లు!

  • Published Dec 11, 2023 | 4:32 PM Updated Updated Dec 11, 2023 | 4:32 PM

తమిళనాడులోని చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని చెరువులు, కుంటలను తలపించాయి. వెల మంది నిరాశ్రయులయ్యారు.

తమిళనాడులోని చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని చెరువులు, కుంటలను తలపించాయి. వెల మంది నిరాశ్రయులయ్యారు.

వీడియో :  ఓరి దేవుడా.. మురికి కాలువలో వేల సంఖ్యలో పాల ప్యాకెట్లు!

ఇటీవల తమిళనాడులో మిచౌంగ్ తుఫాన్ మిగిల్చిన బీభత్సం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వరుసగా వర్షాలు పడటంతో చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తుంది. స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఓ వైపు చెన్నైలో వరద బాధితులు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వారి కష్టాలను కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాజధాని చెన్నై సిటీలో మిచౌంగ్ తుఫాన్ వణికించింది. తుఫాన్ ప్రభావంతో వేల మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రస్తుతం వర్షాలు తగ్గాయి.. చెన్నై సిటీ ఇప్పుడిప్పుడే కలుకుంటుంది. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని దారుణ సంఘటనలు బయటపడుతున్నాయి. తమిళనాడులో చెంగల్ పట్టు జిల్లాలో తాంబరం ప్రాంతంలో మురికి కాలువలో వేల సంఖ్యలో పాల ప్యాకెట్లు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారే షాక్ తిన్నారు. తమిళనాడు కో ఆపరేటీవ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కి చెందినవని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాల సంస్థ. మరి 5 వేల ప్యాకెట్ల వరకు మురికి కాలువలో ఎలా వచ్చిందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అవి మాత్రమే కాదు.. ఇతర కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లు కూడా అక్కడ లభించినట్లు తెలుస్తుంది.

మిచౌంగ్ తుఫాన్ ప్రజలపై దారుణమైన ప్రభావం చూపించిందని.. ఎంతో మంది కన్నీటి కష్టాల్లో ఉన్నారని.. అలాంటి సమయంలో పాల ప్యాకెట్లను ఇంత నిర్లక్ష్యంగా పడేస్తే.. ప్రభుత్వం ఏంచేస్తందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే అధికారుల వెర్షన్ వేరే ఉంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రెండుమూడు రోజుల వరకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. తాంబరంలోని పాల బూత్ ఏజెంట్లు సరైన సమయానికి పాలు విక్రయించలేకపోయా.. దాంతోపాటు నిల్వకూడా చేయలేకపోయారు. కాలువలో దొరికిన 5 వేల ప్యాకెట్లపై ఎక్స‌పయిరీ సమయం డిసెంబర్ 4వ తేదీ రాసి ఉందని అంటున్నారు. తేదీ దాటిన పాలను విక్రయిస్తే ప్రమాదం అని రోడ్డు పక్కన మురికి కాలువలో పడేసి ఉంటారని తాంబరం అధికారులు చెబుతున్నారు. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. అన్ని వేల సంఖ్యలోని పాలు ఆ సమయానికి ఎలాగైనా ఉపయోగించే అవకాశం ఉందని.. పాలను అలా కాలువ పాలు చేయడం, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందిన కొంతమంది విమర్శిస్తున్నారు. మురికి కాలువలో అన్నీ ఆఫ్ లీటర్ ప్యాకెట్లు ఉన్నాయని.. దాదాపు రెండున్నర వేల లీటర్ల వరకు వృధా అయి ఉంటాయిన అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.