P Krishna
Disaster of landslides: ఇటీవల దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. ముఖ్యంగా మహరాష్ట్ర, కేరళా, అస్సాంలో వరుసగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు, జలపాతాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లాయి. ఈ క్రమంలోనే కేరళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Disaster of landslides: ఇటీవల దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. ముఖ్యంగా మహరాష్ట్ర, కేరళా, అస్సాంలో వరుసగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు, జలపాతాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లాయి. ఈ క్రమంలోనే కేరళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
P Krishna
గత పదిహేను రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. మహరాష్ట్ర, కేరళా, అస్సాం, గుజరాత్ లో భారీగా వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు డ్యాములు కూలిపోయాయి.. కాల్వలకు గండి పడి గ్రామాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రవాణా సదుపాయం లేకుండా పోయింది. భారీ వర్షాలకు పాత భవనాలు, కొండ చరియలు విరిగిపోవడం, కూలిపోవడం జరిగింది. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని అనుకునే లోపు కేరళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూర్తి విరాల్లోకి వెళితే..
కేరళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాయనాడు జిల్లా మెప్పాడి వద్ద మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో కొండ చరియ విరిగిపడింది. ఆ తర్వాత తెల్లవారు జామున 4 గంటల సమయంలో మరో కొండ చరియ విరిగిపడింది. వరుసగా కొండ చరియలు విరిగి పడటంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ తో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, స్థానికులు అక్కడికిచేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
మృతులను పోస్ట్ మార్టానికి తరలించగా, గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ వయనాడు, మెప్పాడిలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్ శిథిలాల కింద ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలివస్తున్నాయి. ఈ ఘటనపై కేరళలా సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. ‘ఈ సంఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. పరిస్థితులు సమీక్షిస్తున్నాం.. ఇప్పటికే ప్రభుత్వ విభాగాు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆ ప్రాంతాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి సహాయక చర్యలు దగ్గరుండి చూస్తున్నారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సహాయం కోసం 9656938689, 8086010833 హెల్ప్ లైన్లు నంబర్లు ఏర్పాటు చేశామం’ అని అన్నారు ముఖ్యమంత్రి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర నుంచి అన్ని విధాలుగా సాయం చేస్తామని కేరళా సీఎం పినరయి విజయన్ కు హామీ ఇచ్చారుర. అంతేకాదు మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం కేంద్రం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు.