Dharani
వేసవి కాలం వచ్చిందంటే తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇక తాజాగా సెక్రటేరియట్‌లో భారీ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఆ వివరాలు..
వేసవి కాలం వచ్చిందంటే తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇక తాజాగా సెక్రటేరియట్‌లో భారీ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఆ వివరాలు..
Dharani
వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఇక అడపాదడపా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చిన్న పాటి నిర్లక్ష్యం కూడా భారీ నష్టానికి దారి తీస్తుంది. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌లోని ఓ మాల్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల పదుల సంఖ్యలో జనాలు సజీవదహనం కాగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక తాజాగా పెద్దపల్లిలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. సుమారు 60 లక్షల రూపాయలకు పైగా క్యాష్ తగలబడింది. ఇలా నిత్యం ఏదో ఓ చోట అగ్నిప్రమాదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపుతుంది. ఆ వివరాలు..
సెక్రటేరియట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా. మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం వల్ల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలిసిరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వేసవి కాలం ప్రారంభం అయ్యింది కనుక జనాలు జాగ్రత్తలు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కాలంలో తరచుగా అగ్నిప్రమామాదలు సంభవిస్తాయి. ఊర్లలో అయితే ఇందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గడ్డివాములు, గుడిసెలు ఉండటం వల్ల త్వరగా ప్రమాదాల బారిన పడతాయి. ఇక నగరాల్లో అయితే ఎక్కువగా షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాల వల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. కనుకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ప్రమాదాల వల్ల ఆస్తి నష్టంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. కనుక రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు.. మధ్యాహ్నం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.