iDreamPost
android-app
ios-app

వీడియో: మెకానిక్ జాబ్స్.. వేల సంఖ్యలో బారులు తీరిన యువత!

Mumbai Airport: నేటికాలంలో ఉద్యోగం కోసం పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆ తీవ్రత అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

Mumbai Airport: నేటికాలంలో ఉద్యోగం కోసం పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆ తీవ్రత అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

వీడియో: మెకానిక్  జాబ్స్.. వేల సంఖ్యలో బారులు తీరిన యువత!

ప్రపంచంలో చాలా దేశాలను వివిధ రకాల సమస్యలు పీడిస్తుంటాయి. పేదరికం, నీటి, కాలుష్యం, ఉగ్రవాదం,  ఆర్థిక, మానవ వనరుల కొరత, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు అనేక దేశాల్లో ఉంటాయి. అలానే మన దేశంలో కూడా ఉన్న అనేక సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. అది ఏ స్థాయిలో నిరూపిస్తూ అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తక్కువ పోస్టులు ఉన్న కూడా భారీ సంఖ్యలో దరఖాస్తు వస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రాంతంలో కేవలం వంద ఉద్యోగాలు ఉంటే.. 1500 మంది వచ్చారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. తాజాగా అదే తరహాలో ఓ ఎయిర్ పోర్టులో మెకానిక్ జాబ్స్ కోసం భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని ముంబై నగరంలో కలినా ఎయిర్ పోర్టులో మెకానిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,216 పోస్టులకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు విమానాశ్రయానికి క్యూ కట్టారు. ఇక ఊహించిన స్థాయి కంటే.. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది షాకి గురయ్యారు. అంతే కాక పెద్దఎత్తున అభ్యర్థుల రావడంతో ఎయిర్ పోర్టు రిక్రూట్మెంట్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రేంజ్ లో అభ్యర్థుల తాకిడి ఉంటుందని అంచనా వేయని ఎయిర్పోర్ట్ సిబ్బందికి  నియామాక ప్రక్రియ ను కొనసాగించడం తలనొప్పిగా మారింది.

దీంతో చేసేదేమీ లేక అభ్యర్థులను..వారి వారి రెజ్యూమ్స్ ఆఫీస్ లో ఇచ్చి వెళ్లాలని,  ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఫోన్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక ఎయిర్ పోర్టు సిబ్బంది ఎంత చెప్పినా కూడా అభ్యర్తులు వినకపోవడంతో ఆ ప్రాంతంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మెకానిక్ పోస్టు కోసం భారీగా యువత వచ్చారంటే.. నిరుద్యోగిత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి.. వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.