iDreamPost
android-app
ios-app

దేశంలో తొలి మహిళా ట్రాన్స్ జెండర్ SI..! సక్సెస్ అంత ఈజీగా రాలేదు..

Manvi Madhu Kashyap సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ను చాలా దారుణంగా చూస్తుంటారు. వారిని మనుషులుగా కూడా చూడని పరిస్థితులు ఉండేవి. వారు ఎక్కడి వెళ్లినా అవమానాలు, చిత్కారలను ఎదుర్కొన్నారు. కానీ తాజాగా ఓ మహిళా ట్రాన్స్ జెండర్స్ అద్భుతం సృష్టించింది. ఆమె కథను ఓ సినిమా కూడా తీయోచ్చు.

Manvi Madhu Kashyap సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ను చాలా దారుణంగా చూస్తుంటారు. వారిని మనుషులుగా కూడా చూడని పరిస్థితులు ఉండేవి. వారు ఎక్కడి వెళ్లినా అవమానాలు, చిత్కారలను ఎదుర్కొన్నారు. కానీ తాజాగా ఓ మహిళా ట్రాన్స్ జెండర్స్ అద్భుతం సృష్టించింది. ఆమె కథను ఓ సినిమా కూడా తీయోచ్చు.

దేశంలో తొలి మహిళా ట్రాన్స్ జెండర్ SI..! సక్సెస్ అంత ఈజీగా రాలేదు..

సమాజంలో ట్రాన్స్ జెండర్లు అంటే  చిన్నచూపు  ఉంటుంది. ఇటీవల కాలంలో వారిపై చూసే కోణంలో కొంతవరకు మార్పు వచ్చింది. కానీ కొంతకాలం క్రితం ట్రాన్స్ జెండర్స్ ను చాలా దారుణంగా చూసే వారు. వారిని మనుషులుగా కూడా చూడని పరిస్థితులు ఉండేవి. వారు ఎక్కడి వెళ్లినా అవమానాలు, చిత్కారలను ఎదుర్కొన్నారు. అయితే వీరిలో కూడా కొందరు మంచి పొజిషన్ల్ వెళ్లి..మిగతవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే కొందరు వైద్యులు, లాయర్లు వంటి వివిధ వృత్తులో ఉన్నారు. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే తొలి మహిళా ట్రాన్స్ జెండర్ ఎస్సైగా చరిత్ర సృష్టించింది. మరి..ఆమె ఆ విజయం ఎలా అందుకు, ఆ సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బీహార్‌లోని భాగల్‌పూర్‌ జిల్లాలోని బంకా అనే ఒక చిన్న గ్రామానికి చెందిన మాన్వి మధు కశ్యప్.. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ ఎస్సై నిలిచారు. ట్రాన్స్‌జెండర్స్  కోటాలో ఐదు పోస్టులు రిజర్వ్ చేసినప్పటికీ.. ముగ్గురు మాత్రమే ఉద్యోగాలు సాధించారు.  బీహార్ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అండ్ సర్వీస్ కమిషన్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మాన్వి మధు కశ్వతప్ తో మరో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ట్రాన్స్‌జెండర్లలో ఇద్దరు పురుషులు కాగా.. మరొకరు మహిళ ఉన్నారు. ఇక తాను సాధించిన సక్సెస్ పై మాన్వి మధు కశ్యప్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక తాను ఈ సక్సెస్ అందుకోవడానికి పడిన కష్టాలు, ఇతర విషయాలను వివరించింది.

ఇంతకాలం సమాజానికి భయపడి బతికానాన్ని, తన తల్లిని కలిసేందుకు రహస్యంగా వెళ్లేదాన్నిని తెలిపింది. అయితే ఇప్పుడు ధైర్యంగా పోలీస్ యూనిఫాంతో గ్రామానికి వెళ్లానంటూ ఆనందం వ్యక్తం చేశారు. తాను ట్రాన్స్ జెండర్‌గా ఉన్నందుకు సిగ్గుపడటం లేదని తెలిపింది.  9వ తరగతి చదువుతున్న సమయంలో తాను సాధారణ అమ్మాయిని కాదని తెలిసిందని మాన్వి మధు కశ్యప్  చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలోనే సమాజం తనను దూరం పెట్టి ఒంటరిదాన్ని చేసిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా సాధించి.. అందరు తనవైపు చూసేలా చేయాలని భావించినట్లు తెలిపింది.

ఈక్రమంలోనే పాట్నాకు వెళ్తే..ఏ కోచింగ్ సెంటర్ ను తనను చేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు ఆద్మ్య అదితి గురుకులం నడుపుతున్న గురు రెహమాన్‌ని ఆమెకు కోచింగ్ ఇచ్చారు. అలా రేయింబవళ్లు కష్టపడి చివరకు విజయం సాధించింది. ప్రస్తుతం తనకు లభించిన విజయం లాగానే సమాజంలో కూడా మార్పు రావాలని తాను కోరుకుంటున్నట్లు మధు మాన్వి చెప్పారు. ప్రస్తుతం తన విజయాన్ని చూసేందుకు తన తండ్రి నరేంద్ర ప్రతాప్ సింగ్ లేరని.. కానీ తన తల్లి మాలా దేవి చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఐదుగురు అన్నదమ్ముల్లో నాలుగో వ్యక్తి అయిన మాన్వి మధు.. తన కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని చెప్పారు. మొదట తనను వ్యతిరేకించినా తర్వాత అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు లభించిన విజయం లాగానే సమాజంలో కూడా మార్పు రావాలని తాను కోరుకుంటున్నట్లు మధు చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి