iDreamPost
android-app
ios-app

వీడియో: పుట్టినరోజు సంతోషంగా కేక్ కోసింది.. అదే కేక్ తిని చనిపోయింది!

Girl Passed After Eating Birthday Cake: పుట్టినరోజున అందరిలాగానే ఆ చిన్నారిని కూడా సంతోష పెట్టాలని ఆ కుటుంబం కేక్ కొనింది. అయితే అదే కేక్ వల్ల వారి కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.

Girl Passed After Eating Birthday Cake: పుట్టినరోజున అందరిలాగానే ఆ చిన్నారిని కూడా సంతోష పెట్టాలని ఆ కుటుంబం కేక్ కొనింది. అయితే అదే కేక్ వల్ల వారి కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.

వీడియో: పుట్టినరోజు సంతోషంగా కేక్ కోసింది.. అదే కేక్ తిని చనిపోయింది!

ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే ఆ రోజు హడావుడి మాములుగా ఉండదు. ఇళ్లంతా పండగలా ఉంటుంది. సెలబ్రేషన్స్, కేక్ కటింగ్లు అంటూ నానా హంగామా చేస్తారు. ఆ కుటుంబం కూడా తమ చిన్నారి తల్లి పుట్టినరోజుని అంతే ఘనంగా నిర్వహించాలని భావించింది. తమ గారాలపట్టి పుట్టినరోజు కోసం కేక్ కూడా ఆర్డర్ చేశారు. కుటుంబం మొత్తం కలిసి ఎంతో సంతోషంగా ఆ కేక్ ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కేక్ కట్ చేసిన పుట్టినరోజు జరుపుకున్న ఆ చిన్నారి అదే కేక్ తిని చనిపోయింది. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

సాధారణంగా బర్త్ డే అంటే ఇప్పుడు అందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ కుటుంబం కూడా అలాగే తమ చిన్నారి పుట్టినరోజుని జరపాలి అనుకోవడమే వారికి శాపంగా మారింది. ఈ విషాద ఘటన మార్చి 24న పంజాబ్ లో జరిగింది. పటియాలలోని ఓ కుటుంబం తమ పదేళ్ల చిన్నారి పుట్టిన రోజున పటియాలాలోని ‘కేక్ కన్హా’ అనే బేకరీలో ఆన్ లైన్ లేక్ ఆర్డర్ చేసింది. కేక్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కేస్ కట్ చేసింది. నవ్వులు చిందిస్తూ చిన్నారి మాన్వీ కేక్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తాత చెప్పిన వివరాల ప్రకారం.. కేక్ తిన్న తర్వాత ఆ కుటుంబం మొత్తం అనారోగ్యం పాలైంది. రాత్రి 7 గంటలకు కేక్ కట్ చేస్తే.. 10 గంటలకు అందరి ఆరోగ్యం దెబ్బతింది. మాన్వీ, ఆమె చెల్లి ఇద్దరికీ వాంతులు అయ్యాయి. మాన్వీ తనకు బాగా దాహం వేస్తున్నట్లు చెప్పింది. గొంతు తడి ఆరిపోతోందని చెప్పిందట. ఆ తర్వాత మాన్వీ నిద్రపోయింది.

వెంటనే ఆ కుటుంబం మాన్వీని ఆస్పత్రికి తరలించారు. తర్వాతి రోజు ఉదయం మాన్వీ ఆరోగ్యం మరింత దెబ్బతింది. ఆమెకు ఆక్సిజన్ పెట్టారు. ఈసీజీ కూడా తీశారు. కానీ, చివరికి ఆ చిన్నారిని వైద్యులు కాపాడలేకపోయారని మాన్వీ తాత హర్బన్ లాల్ వెల్లడించారు. ఆ చిన్నారి కుటుంబం బేకరీ వాళ్ల వల్లే తమ చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. వాళ్లు ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ లో ఏదో విషపూరిత పదార్థాలు కలిసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బేకరీ ఓనర్ పై కేసు నమోదు చేశారు. మాన్వీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేక్ శాంపిల్ ని టెస్టుల కోసం ల్యాబ్ కి పంపినట్లు మాన్వీ తాత తెలియజేశారు. సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలని కేక్ కట్ చేస్తే.. అదే కేక్ తిని చిన్నారి చనిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.