వారికి కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి రూ. 15 వేలు

Mansukh Mandaviya: కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వారికి గుడ్ న్యూస్ అందించారు. వారి ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మందికి లబ్ధి చేకూరనున్నది.

Mansukh Mandaviya: కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వారికి గుడ్ న్యూస్ అందించారు. వారి ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మందికి లబ్ధి చేకూరనున్నది.

ఈ ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్తాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి రూ. 15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వారికి గుడ్ న్యూస్ అందించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని ఈపీఎఫ్‌ అకౌంట్లలో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. వారి ఖాతాల్లో రూ. 15 వేలు జమకానున్నాయి.

ఈ మేరకు ఒక ఉద్యోగికి గరిష్ఠంగా రూ.15 వేలు అందనుంది. అయితే ఇది అందరికి వర్తించదు. నెలకు గరిష్టంగా లక్షలోపు జీతం ఉన్న వారే ఈ స్కీమ్‌కు అర్హులు అని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 2.1 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని.. నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. దీంతో పాటు ఉద్యోగ కల్పనపై కూడా దృష్టిపెట్టినట్లు ప్రకటించారు. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96 లక్షల మంది చందాదారులు, 4.54 లక్షల మంది పెన్షన్‌ తీసుకునేవారు ఉన్నట్టు కేంద్రమంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో బర్కత్‌పురలో ఉన్న పీఎఫ్‌ కా ర్యాలయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ శనివారం సందర్శించారు. యువ ఉద్యోగుల కోసం కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌(ఈఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ పథకం కింద.. ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే యువతీయువకులకు ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుందన్నారు. యువతకు ఉపాధే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. వారికి ఉపాధి అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువత కోసం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Show comments