Arjun Suravaram
ప్రేమ కోసం ఎలాంటి పనులు చేయడానికైన కొందరు వెనుకాడరు. ఇంకా విచిత్రం ఏమిటంటే..కొందరు తమ ప్రేమను తగ్గించుకునేందుకు అనేక రకాల దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ప్రేమ కోసం ఎలాంటి పనులు చేయడానికైన కొందరు వెనుకాడరు. ఇంకా విచిత్రం ఏమిటంటే..కొందరు తమ ప్రేమను తగ్గించుకునేందుకు అనేక రకాల దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
Arjun Suravaram
ప్రేమ అనేది పలకడానికి చాలా చిన్నపదమే. అయినా దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రేమ విషయంలో అనేక రకాల వ్యక్తిత్వాలు కలిగిన వారిని మనం చూశాం. అలానే ప్రేమ కోసం త్యాగం చేసే వారిని మనం చాలా మందిని చూసి ఉంటాం. ఇక ప్రేమ కోసం ఎలాంటి పనులు చేయడానికైన కొందరు వెనుకాడరు. ఇంకా విచిత్రం ఏమిటంటే..కొందరు తమ ప్రేమను తగ్గించుకునేందుకు అనేక రకాల దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ అబ్బాయి ప్రేమలో పడిన ఓ క్రిమినల్.. దారుణైన పని చేశాడు. డాక్టర్లను ప్రలోభ పెట్టి..యువకుడికి తెలియకుండా అవయవాల మార్పిడి చేశారు. స్పృహలోకి వచ్చిన అనంతరం అమ్మాయిగా మారిన ఆ యువకుడు..తనను తాను చూసుకుని షాకయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓం ప్రకాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా మంచి స్నేహం మారింది. అలా వారి ఇద్దరు మంచి స్నేహితులుగా రెండేళ్ల నుంచి ఉంటున్నారు. ఇటీవల ఆ యువకుడికి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వైద్య పరీక్షలు చేయిస్తాని చెప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈనెల 3వ తేదీన ఆ యువకుడిని మన్సూర్‌పుర్‌లోని బేగ్‌రాజ్‌పుర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఓం ప్రకాశ్ తీసుకెళ్లాడు. అంతేకాక డాక్టర్లను మభ్యపెట్టి ఆ యువకుడి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు.యువకుడికి మత్తుమందు ఇచ్చిన డాక్టర్లు.. పురుష అవయవాలను తొలగించారు.
ఇక కాసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన తరువాత తాను అమ్మాయిగా మారిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఆస్పత్రి వైద్యులతో చేతులు కలిసి ఓం ప్రకాష్.. ఈ ఆపరేషన్ చేయించినట్లు ఆ యువకుడు తెలుసుకున్నాడు. స్పృహలోకి వచ్చిన యువకుడి వద్దకు ఓం ప్రకాశ్ వెళ్లాడు. తానే ఇదంతా చేయించినట్లు చెప్పినట్లు వివరించాడు. తాను ప్రేమిస్తున్నట్లు ఓం ప్రకాశ్ యువకుడికి చెప్పాడు. ఇక జీవితాంతం ఇద్దరం కలిసి ఉండొచ్చని, పెళ్లి చేసుకుందామని తెలిపాడు. ఇక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పాడని పేర్కొన్నాడు. ఇక తన ప్రేమను ఒప్పుకోకపోతే యువకుడి తండ్రిని చంపేస్తానని బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత పేర్కొన్నాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓం ప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. అమ్మాయిగా మారడంతో యువకుడిపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం పడ్డాడని, అతడికి రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని బాధితుడు బంధువులు డిమాండ్ చేశారు.