iDreamPost
android-app
ios-app

వీడియో: అంబులెన్స్ రాలేదు.. తోపుడు బండే దిక్కైంది!

  • Published Nov 07, 2023 | 8:51 PM Updated Updated Nov 07, 2023 | 8:51 PM

ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నామని.. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు పనిచేస్తున్నాయని అంటున్నారు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే సంఘటనలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నామని.. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు పనిచేస్తున్నాయని అంటున్నారు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే సంఘటనలపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియో: అంబులెన్స్ రాలేదు.. తోపుడు బండే దిక్కైంది!

దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్నో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సరైన సమయానికి అంబులెన్స్ రావు, స్ట్రెచర్లు, బెడ్లు ఉండవు. కొన్నిసార్లు రోగి ఆపదలో ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు.. వైద్యులు అందుబాటు లో ఉండరు. ఇలా ఎన్నో లోపాలు ప్రభుత్వాసుపత్రుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వీళ్ల వైఖరి మాత్రం మారదు. కొన్నిసార్లు రోగి పరిస్థితి విషమంగా ఉండి.. సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడం వల్ల ఆ రోగి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటన ప్రతిరోజ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో హమీర్ పూర్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అంబులెన్స్ 108 కి ఫోన్ కలిపారు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రోగి పరిస్తితి విషమంగా మారుతుందని భయంతో కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న కూరగాయల తోపుడు బండిపై ఆస్పత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. యోగి ప్రభుత్వంలో ప్రజలు ఆస్పత్రులకు తోపుడు బండ్లపై తరలించాల్సి వస్తుందిన విమర్శలు గుప్పించారు. హమీర్ పూర్ లో అంబులెన్స్ అందుబాటులో లేక తోపుడు బండిపై రోగిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.. ఇది ఎంతో సిగ్గు చేటు. ఇదీ రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ పరిస్థితి.. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ట్విట్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.. వీటన్నింటికి ప్రజలు 2024 లో తప్పకుండా సమాధానం చెబుతారని ఆయన విమర్శించారు.

ఈ ఘటన హమీర్ పూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. 108 కి ఫోన్ చేస్తే ఎంతకీ స్పందించకపోవడంతో.. రోగి పరిస్థితి దారుణంగా మారుతుందన్న భయంతో అక్కడే ఉన్న తోపుడు బండిపై ఆ మహిళలను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ.. రోగి బంధువులు అంబులెన్స్ కి సంబంధించిన హెల్ప్ లైన్ కి ఫోన్ చేయలేదని.. వారు 108 కి బదులుగా 1108 కి పదే పదే డయల్ చేయడం వల్ల 108 సిబ్బందికి ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నా.. వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.