Arjun Suravaram
ఇటీవల కొంతకాలం నుంచి మాల్దీవులకు, భారత్ మధ్య దౌత్యబంధాలు బలహీనబడిన సంగతి తెలిసింది. అలానే తరచూ ఆదేశానికి చెందిన నేతలు పరోక్షంగా భారత్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా చేసిన మాల్దీవుల మాజీ మంత్రి భారత్ కి క్షమాపణలు చెప్పింది.
ఇటీవల కొంతకాలం నుంచి మాల్దీవులకు, భారత్ మధ్య దౌత్యబంధాలు బలహీనబడిన సంగతి తెలిసింది. అలానే తరచూ ఆదేశానికి చెందిన నేతలు పరోక్షంగా భారత్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా చేసిన మాల్దీవుల మాజీ మంత్రి భారత్ కి క్షమాపణలు చెప్పింది.
Arjun Suravaram
మాల్డీవులకు, భారత్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్ పర్యటించారు. ఈ సందర్భంగా.. అక్కడి పర్యాటగ రంగాన్ని ప్రమోట్ చేశారు. సముద్రం తీరంలో స్నోర్క్‌లింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందర్భంలో మాల్దీవ్స్ మంత్రులు కొందరు మోదీపై విమర్శలు చేశారు. ఫలితంగా చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవ్స్ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్‌కి వెళ్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది ఇలాంటి ఆ సమయంలో ప్రధాని మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాల్డీవుల మాజీ మంత్రి తాజాగా భారత్ ను క్షమాపణలు కోరారు.
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన చేసిన సమయంలో ఆయనపై మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియునా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అలానే ఆ మాజీ మంత్రి మరోసారి వివాదస్పద పోస్టు చేశారు. భారత త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని పోలి ఉన్న గుర్తుతో, మాల్దీవులు ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ)పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాక ఆమెపై ప్రతిపక్ష పార్టీ విరుచకపడింది. ఇలా తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె భారత్ కి క్షమాపణలు చెప్పారు. ఇటీవల తాను సోషల్ మీడియా చేసిన ఓ పోస్టు విమర్శలకు దారి తీసిందని, ఆ పోస్టు వల్ల ఏదైనా గందరగోళం లేదా నేరం జరిగినే తనను క్షమించాలని మరియం షియునా అన్నారు. ఈమె మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు చెందిన పార్టీకి చెందిన వ్యక్తి.
ఇంకా ఆమె తన పోస్టులు పలు అంశాలను పేర్కొంది. తాను మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని ఉద్దేశించి చేసిన ట్వీట్ భారతీయ జెండాను పోలి ఉందని తన దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని విజ్ఞప్తి చేసింది. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే తాను చింతిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించింది. మాల్దీవులుకు భారత్‌తో ఉన్న సంబంధాన్ని ఎంతో గౌరవంగా భావిస్తామని, భవిష్యత్తులో సోషల్ మీడియాలో పోస్టు చేసే కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.
ఇటీవలే భారత్, మాల్దీవులకు నిత్యావసరాలను సప్లయ్ చేసేందుకు అంగీకరించింది. అలా భారత్ అంగీకరించిన తర్వాతనే ఆమె ఈ పోస్టు చేసింది. మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత భారత్ తో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఆయన చైనా అనుకూలంగా వ్యవహరిస్తుండంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఈక్రమంలోనే భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలు బలహీన పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
I would like to address a recent social media post of mine that has garnered attention and criticism .I extend my sincerest apologies for any confusion or offense caused by the content of my recent post.
It was brought to my attention that the image used in my response to the…
— Mariyam Shiuna (@shiuna_m) April 8, 2024