iDreamPost
android-app
ios-app

షాకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. నటి అనుమానాస్పద మృతి!

  • Published Sep 01, 2023 | 12:36 PM Updated Updated Sep 01, 2023 | 3:53 PM
  • Published Sep 01, 2023 | 12:36 PMUpdated Sep 01, 2023 | 3:53 PM
షాకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. నటి అనుమానాస్పద మృతి!

గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు మరణిస్తూనే ఉన్నారు. దీంతో తమ అభిమాన నటులు మృతి చెందడంతో వారి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఈ వరుస విషాదాలు మరువకముందే తాజాగా మలయాళ నటి అపర్ణ పి. నాయ‌ర్ (31) మృతి చెందారు. తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అంతటా పరిశీలించారు.

ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ నటి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి అపర్ణ పి. నాయ‌ర్ మొదటగా మలయాళ టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో… మేఘ‌తీర్థం, అచ‌యాన్స్ వంటి సినిమాలే కాకుండా ఇంకా చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు.

తన అందం, అభినయంతో ఫ్యాన్స్ కు వినోదాన్ని ఇచ్చి ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మరింత భవిష్యత్ ఉన్న నటి అపర్ణ పి. నాయ‌ర్.. ఉన్నట్టుండి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు షాక్ గురవుతున్నారు. పైగా ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేక అనుమనాలకు తావిస్తోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet