iDreamPost

ఈ మాట కోసమే ఐదేళ్ల నిరీక్షణ.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

  • Author ajaykrishna Updated - 01:35 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 01:35 PM, Fri - 1 September 23
ఈ మాట కోసమే ఐదేళ్ల నిరీక్షణ.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

ఒక సినిమా చేసినప్పుడు హిట్.. సూపర్.. బ్లాక్ బస్టర్.. ఈ మాటలు వినేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు ఎంతగా వెయిట్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యాన్స్ హిట్టు అనే ఒక్క మాటతో.. తమ హీరో హిట్టు కొట్టేశాడని సంబరాలు చేసుకుంటారు. రౌడీ హీరో అలాంటి హిట్ ఇచ్చి చాలకాలం అయ్యింది. ఐదేళ్ల క్రితం గీతగోవిందం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ చేరిపోయింది. అప్పటినుండి విజయ్ దేవరకొండ సినిమాలకు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్స్ కి రావడం మొదలైంది.

అనూహ్యంగా ఆ తరువాత విజయ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు విజయ్ కి డిజాస్టర్స్ అందించాయి. అయినా సరే ఏమాత్రం కుంగిపోకుండా కష్టపడి రొమాంటిక్ లవ్ డ్రామాగా.. ఖుషి చేశాడు. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీస్ వారు బిగ్ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. లైగర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. కాగా.. ఈ సినిమాకు ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ మొదలైనట్లు తెలుస్తోంది.

ఇక ఓవర్సీస్ నుండి కూడా ప్రేక్షకుల నుండి ఖుషి పట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు విజయ్ ఖాతాలో హిట్టు పడినట్లే అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు విజయ్ కూడా ఖుషి గురించి పాజిటివ్ రెస్పాన్స్ విని.. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయిపోయాడు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి.. “నాతో పాటు ఐదేళ్లు ఎంతో ఓపికగా ఎదురుచూశారు. ఈ రోజు సాధించాం. వందల ఫోన్లు, మెసెజ్‌‌ లతో నిద్రలేచాను. కన్నీళ్లు ఆగట్లేదు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూడండి. మీరు చూస్తారని నాకు తెలుసు. లవ్ యూ ఆల్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఖుషి పట్ల విజయ్ ఫస్ట్ రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఖుషి మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి