Arjun Suravaram
Kerala Floods 2024: కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన, వరదల సృష్టించిన బీభత్సం దేశమంతటిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ఘోరమైన విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను కాపాడేందుకు సహాయక చర్యల్లో ఓ అద్భుతమైన పని చేసి.. సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.
Kerala Floods 2024: కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన, వరదల సృష్టించిన బీభత్సం దేశమంతటిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ఘోరమైన విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను కాపాడేందుకు సహాయక చర్యల్లో ఓ అద్భుతమైన పని చేసి.. సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.
Arjun Suravaram
గతకొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న పేరు కేరళ. కారణం అక్కడ వరదలు సృష్టించిన విలయం. భారీ వానల కారణంగా కేరళలోని వయనాడ్ ప్రాంతంలో పెను విధ్వంసం చోటుచేసుకుంది. దాదాపు 286 మంది మృతి చెందగా, మరెంతో మంది ఆచూకి గల్లంతైంది. కనీవినీ ఎరుగని రీతీలో వయనాడ్ ప్రాంతంలో వరద ప్రళయం వచ్చింది. సహాయక చర్యలు చేసేందుకు అధికారులకు, రెస్క్యూ టీమ్ లకు కూడా కత్తిమీద సాముల మారింది. ఇలాంటి దుర్భేచ్ఛమైన పరిస్థితులు ఉన్న ఆ ప్రాంతంలో ఓ మహిళ చేసిన సాహసం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాక ఆమెకు అందరు సెల్యూట్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె పేరు సీతా షెల్కే..కానీ ఈ విలయంలో బాధితులను కాపాడటంలో మాత్రం సివంగిలో దూకారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన, వరదల సృష్టించిన బీభత్సం దేశమంతటిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ఘోరమైన విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను కాపాడేందుకు సహాయక చర్యల్లో ఓ అద్భుతమైన పని చేసి.. సీతా షెల్కే వార్తల్లో నిలిచారు. అతి తక్కువ సమయంలో 190 అడుగుల పొవైన బ్రిడ్జ్ ను మేజర్ సీతా నిర్మించి రికార్డులోకి ఎక్కారు. రెస్క్యూ టీమ్ వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ఇలాంటి సమయంలో వారికి సాయం చేసేందుకు పట్టుదలతో శ్రమించి.. అతి తక్కువ సమయంలోనే గంటల వ్యవధిలోనే 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ ను నిర్మించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ లో మేజర్ సీతా షెల్కే విధులు నిర్వహిస్తున్నారు. కేరళ వరదల్లో సహాయక చర్యల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు.
మేజర్ సీత షెల్కే, మేజర్ అనీశ్ ఆధ్వర్యంలోని బృందం చేసిన కృషి ప్రత్యేకంగా నిలుస్తుంది. వయనాడ్ ప్రాంతంలో కేవలం 16 గంటల్లోనే 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగల పొడవైన వంతెనను ఈ బృందం నిర్మించింది. వంతెన నిర్మాణం జులై 31వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభించి.. మరుసటి రోజు అంటే ఆగష్టు 1వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పూర్తి చేశారు. ఇలా బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయడానికి మేజర్ సీతా షెల్కే నాయకత్వంలోని సబ్యులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణం ద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభ కావడంతో పాటు, వేగంగా జరుగుతుంది. మొత్తంగా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోసాంకేతిక నైపుణ్యం,అంకితభావం, ధైర్య సాహసాలు చూపిన సీతా పై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాక ఇండియన్ ఆర్మీలో మహిళా అధికారు పాత్రను సీతా షెల్కే గుర్తు చేసింది.
Kudos to Maj Seeta Shelke & her team of #MadrasEngineersGroup of #IndianArmy who went beyond all kind of challenges & built the 190ft long bridge with 24 Ton capacity in 16 hours in #Wayanad Started at 9 pm on 31 July & completed at 5:30 pm on 1 Aug. @giridhararamane #OPMADAD pic.twitter.com/QDa6yOt6Z2
— PRO Defence Trivandrum (@DefencePROTvm) August 1, 2024