P Krishna
MGNREGA Scheme Benefits: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చే ఉద్దేశంతో పని కల్పిస్తూ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టారు.
MGNREGA Scheme Benefits: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చే ఉద్దేశంతో పని కల్పిస్తూ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టారు.
P Krishna
పేద ప్రజలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించారు. 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశ పెట్టింది. గ్రామీణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రహదారులు అభివృద్ది, కాలువలు, చెరువులు, బావులు, రక్షణ పనులు, వరదల నియంత్రణ, సంప్రదాయ నీటి వనరుల పునరుద్దరణ, కరువు నివారణ చర్యలు, అడవులు పెంపకం తదితర పనులు చేపట్టడం.మీరు ప్రతి రోజూ కరువు పనికి వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి.. రూ. 50 ఇస్తారంట. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉపాధి హామీ పని కి వెళ్లేవారికి గుడ్ న్యూస్. తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని ప్రదేశాల్లో కూలీలకు తాగు నీరు, నీడ, చిన్న చిన్న గాయాలు అయితే ప్రాథమిక వైద్య శాలలో ప్రథమ చికిత్స చేయబడుతుంది. ఇటీవల కరువు పనులకు వెళ్లిన వారికి అనుకోని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ప్రాణాలు పోతున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ పనిలో ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే ఉపాధి హామీ పథకం కింద రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తారని చట్టంలో పొందుపరిచారని ఓ అధికారి తెలిపారు. ఈ విషయం గురించి నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఏపీవో రామ్మోహన్ ఈ చట్టంలోని పని ప్రదేశంలో ఎటువంటి సౌకర్యాలు హక్కులు ఉన్నాయో వివరాలు వివరించారు.
కరువు పని కోసం వెళ్లిన వారికి ఆ ప్రదేశంలో ప్రమాద వశాత్తు గాయాలు జరిగినా.. ఒకవేళ అనుకోని ప్రమాదం వల్ల కన్నుమూసినా జాతీయ ఉపాధి హామీ పథకం కింద వారి కుటుంబ సభ్యులకు 50 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తారు. ఇక ఎండా కాలంలో కరువు పనులు చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కరువు పని చేసే వారికి నీడ, నీళ్లు వంటి సౌకర్యాలు గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాడు చేయడం జరుగుతుందని తెలిపారు. జాబ్ కార్డు ఎంటర్ చేసే సమయంలో దీర్ఘ కాలిక వ్యాధులు ఏవైనా ఉన్నయెడల వారి ఆరోగ్యం మెరగు పడిన తర్వాత ఉపాధి పనులకు రావాలని సూచిస్తున్నామని తెలిపారు.