తల వంచి క్షమాపణలు చెబుతున్నా! ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్!

PM Narendra Modi: ఇటీవలే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాను పర్యంటించిన ప్రధాన మోడీ విగ్రహం కూలిపోయిన ఘటనపై స్పందించి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Narendra Modi: ఇటీవలే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాను పర్యంటించిన ప్రధాన మోడీ విగ్రహం కూలిపోయిన ఘటనపై స్పందించి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రంలోని సింధూదుర్గ్ జిల్లాలో మాల్వాన్ ప్రాంతంలో గతేడాది ( ఆగస్టు 26, 2023న) ఛత్రపతి శివాజీ విగ్రహం ఆకస్మాత్తుగా కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విగ్రహం కూలిపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ గతేడాది నేవీ డే సందర్భంగా.. (డిసెంబర్ 4, 2023న) రాజ్ కోట్ కోటలోని 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఇక ఈ విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఏడాది కూడా పూర్తి కాకుండానే కూలిపోవడడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పర్యంటించిన ప్రధాన మోడీ.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇటీవలే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంతో తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్షా పార్టీ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు.అలాగే విగ్రహాం కూలిపోయిన ఘటనపై ధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిడంతో పాటు మోడీకి క్షమపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాను పర్యటించిన ప్రధానమంత్రి ఈ ఘటనపై స్పందించి క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను బీజేపీ ప్రకటించినప్పుడు మొదటిసారిగా రాయ్ గఢ్ జిల్లాలోని ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ సమాధి వద్దకు చేరుకున్నాను. ఇక అక్కడ నుంచే తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిచనని, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది మనకు ఒక పేరు మాత్రమే కాదని, నా దేవుడని తెలిపారు. కానీ, ఈరోజు నా దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు నేను తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. భరతమాత గొప్ప బిడ్డ అయిన ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను దూషించడం, అవమానించడం చేసే వాళ్లం కాదని’ పేర్కొన్నారు.

మరోవైపు ఇటీవలే మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలిందని, అయితే విగ్రహంలో నాణ్యత లోపంతో ఇలా జరిగిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ, విచారణలో భాగంగా విగ్రహం కూలడానికి ఆరు రోజుల ముందే విగ్రహమంతా తుప్పుపట్టి ఉండటం గమనార్హం. దీంతో విగ్రహం కూలిన ఘటనలలో విగ్ర హ నిర్మాణ సలహాదారు చేతన్ పటేల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్ ఏక్ నాథ్ షిండ త్వరలోనే మళ్లీ ఛత్రపతి శివాజీ విగ్రహంను మునపటి విగ్రహం కంటే ఇంకా భారీ పరిమాణంలో ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. మరీ, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై ప్రధాని క్షమాపణలు చెప్పడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments