iDreamPost
android-app
ios-app

దారుణం.. చనిపోయిన బిడ్డలని భుజాన మోసుకుంటూ!

శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం పొరుగు దేశాలతో పోటీ పడుతుంది. ఆకాశంలో ఎంతో ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తుంది. కానీ దేశంలో ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా గ్రామీణం, మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. తాజాగా..

శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం పొరుగు దేశాలతో పోటీ పడుతుంది. ఆకాశంలో ఎంతో ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తుంది. కానీ దేశంలో ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా గ్రామీణం, మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. తాజాగా..

దారుణం.. చనిపోయిన బిడ్డలని భుజాన మోసుకుంటూ!

సాంకేతిక రంగంలో దేశం అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా కొన్ని గ్రామాల్లో సరైన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. తాగు నీరే కాదు సరైన మౌళిక సదుపాయాలు లేక ఇబ్బందికి గురౌతున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేక సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే సమీపంలోని నగరంలోకి తీసుకు రావాల్సిందే. ఇక గర్బిణీల పరిస్థితి చెప్పలేనివి. ఏదో ఒక అవస్థ పడి.. గుట్టలు, కొండలు దాటుకుంటూ ఆసుపత్రికి మోసుకొస్తే.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల కొంత మంది చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. సకాలంలో సరైన వైద్యం అందక ఇద్దరు చిన్నారులను పోగొట్టుకున్నారు భార్యా భర్తలు. విష జ్వరాల బారిన పడ్డ తమ పిల్లల్ని కాపాడుకునేందుకు ఓ ఆసుపత్రికి తీసుకురాగా.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల  ఆ  ఇద్దరు చనిపోయారు.  వీరికి పుత్రుల శోకం మిగిలింది.

అంతటి  వేదనలో కూడా ఆసుపత్రి యాజమాన్యం వారికి సాయం అందించలేదు.  అంబులెన్స్ వంటి సర్వీసులను  ఇవ్వలేదు. దీంతో చిన్నారుల మృతదేహాలను భుజాలపై మోసుకుని వెళ్లారు దంపతులు. ఈ హృదయ విదారకమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను భుజాలపై మోసుకెళుతున్న హృదయ విదాకరమైన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. గడ్చిరోలి నియోజకవర్గంలోని అహేరి తాలూకాకు చెందిన భార్యా భర్తలు.. తమ కొడుకులకు జ్వరం రాగా.. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. సకారంలో వైద్యం అందలేదు. దీంతో ఇద్దరు బిడ్డల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. గంటల వ్యవధిలో ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు ఆ దంపతులు. అంతటి విషాదంలో కూడా వారికి ఆసుపత్రి యాజమాన్యం దయ చూపలేదు. మృతదేహాలను ఆసుపత్రి నుండి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వలేదు.

దీంతో బాధను దిగమింగుకుంటూ.. బిడ్డల్ని భుజాన వేసుకుని తీసుకెళ్లారు. ఓ వైపు వర్షం మరో వైపు వెళ్లే మార్గం బురద.. అయినప్పటికీ కనీస కనికరం చూపలేదు ఆసుపత్రి యాజమాన్యం.  ఈ వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ పంచుకున్నారు. సకాలంలో చికిత్స ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి దిగజారి.. గంటల వ్యవధిలోనే అన్నాదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి మృతదేహాలను బాధితుల గ్రామమైన పట్టిగావ్‌కు తరలించడానికి అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. చివరకు ఇలా అవస్థలు పడుతూ తీసుకెళ్లారు. దీనిపై ఇప్పుడు మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్షం మధ్యలో యుద్ధం మొదలైంది.

అధికార మహాయుతి మిత్ర పక్షాలు, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,  బీజెపీకి నేత  దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేస్తున్నారంటూ ఎత్తి చూపుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ జిల్లాకు హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంరక్షక మంత్రి అని, మహాకూటమిలోని కేబినెట్ మంత్రి ధర్మారావు బాబా ఆత్రం అదే నియోజకవర్గమని,  మహారాష్ట్ర వ్యాప్తంగా ఈవెంట్స్ నిర్వహించి.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ ఇద్దరు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. గొప్పలు చెప్పుకోవడం మాని గడ్చిరోలిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అక్కడ మరణాల సంఖ్య ఎలా ఉందో చూడాలంటూ పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.