Dharani
Maharashtra Mukhyamantri Ladki Bahin Yojana: మహిళలకు నెలకు రూ.1500 అందించే కార్యక్రమాన్ని రేపటి నుంచే ప్రారంభించనున్నారు. ఈ పథకం వివరాలు..
Maharashtra Mukhyamantri Ladki Bahin Yojana: మహిళలకు నెలకు రూ.1500 అందించే కార్యక్రమాన్ని రేపటి నుంచే ప్రారంభించనున్నారు. ఈ పథకం వివరాలు..
Dharani
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో స్కీమ్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రతి నెలా వారికి నేరుగా నగదు సాయాన్ని అందిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. త్వరలోనే దీన్ని అమలు చేయనుంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. పైగా రేపటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇంతకు ఇది ఏ పథకం.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలంటే..
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. త్వరలోనే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం కోసం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ శివసేన ఎన్సీపీ కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 వారి అకౌంట్లలో వేయనున్నారు.
ఈ కొత్త పథకాన్ని శనివారం నుంచే అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తాజాగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా రెండు నెలలకు ఒకసారి 3 వేల రూపాయల చొప్పున మహిళల ఖాతాలో జమ చేయనున్నారు. ఇక రాష్ట్రంలోని కోటి మందికి పైగా మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు షిండే సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది.
ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన కింద అప్లై చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్‌ను తీసుకువచ్చింది. అదే నారీ శక్తి దూత్ యాప్. దీనిలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.