Free Gas Cylinder: మహిళలకు భారీ శుభవార్త.. నెలకు రూ.1500, ఉచితంగా 3 సిలిండర్లు

Maharashtra-Ladki Bahin Scheme, Rs 1500, Three Free Gas Cylinder: మహిళలకు ప్రభుత్వం బంపరాఫర్‌ ప్రకటించింది. వారి కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అర్హులైన వారికి నెలకు 1500 రూపాయలు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లను ఇవ్వనున్నారు. ఆ వివరాలు..

Maharashtra-Ladki Bahin Scheme, Rs 1500, Three Free Gas Cylinder: మహిళలకు ప్రభుత్వం బంపరాఫర్‌ ప్రకటించింది. వారి కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అర్హులైన వారికి నెలకు 1500 రూపాయలు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లను ఇవ్వనున్నారు. ఆ వివరాలు..

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నాయి. వారి కోసమే ప్రత్యేకంగా స్కీమ్‌లను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, నెలకు 2500 రూపాయలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో రెండు హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. త్వరలోనే నెలకు 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలిపింది. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు అత్యధికంగా కేటాయింపులు చేశారు. ఈక్రమంలో మరో ప్రభుత్వం తెలంగాణ బాటలో నడవనుంది. అక్కడ మహిళలకు నెలకు 1500 రూపాయలతో పాటు.. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
మహారాష్ట్ర సర్కార్ కూడా మహిళలు కోసం రెండు సరికొత్త పథకాల్ని ప్రవేశ పెట్టింది. ఆ రెండు పథకాలే లడ్కీ బహిన్ యోజన, అన్నపూర్ణ యోజన. ఈ రెండు స్కీమ్‌లకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. దాదాపు ఒక కోటి మందికి పైగా మహిళలు రెండు పథకాల ప్రయోజనాలు పొందనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకాల ద్వారా మహిళలు ఇటు స్టైఫండ్‌, అటు ఉచిత సిలిండర్లు పొందుతారు.
మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి లడ్కీ బహిన్ యోజనపథకాన్ని రూపొందించారు. దీని కింద, అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 స్టైఫండ్‌ ఇస్తారు. 21-60 సంవత్సరాల వయసున్న వివాహితలు, విడాకులు పొందిన, నిరాశ్రయులైన మహిళలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
ఈ పథకానికి జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే సుమారు కోటికి పైగా మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. పుణే నుంచి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.. దరఖాస్తుదారుల్లో అత్యధిక భాగం వివాహిత మహిళలే ఉన్నారని అంటున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం.. ఉజ్వల స్కీమ్‌ కింద గ్యాస్‌ సిలిండర్‌ మీద 300 రూపాయలు సబ్సిడీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సిలిండర్‌ రేటును మొత్తం కవర్‌ చేయడానికి ప్రభుత్వం అదనంగా 500 రూపాయల సబ్సిడీని అందించాలని నిర్ణయించింది. అంటే లడ్కీ బహిన్‌ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ మీద మొత్తం 800 రూపాయలను భరిస్తుంది.
త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రభుత్వం ఇలా ఉచిత వరాలు ఇస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 లోక్‌కసభ స్థానాలకు గాను బీపేపీ కేవలం 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్న చేసుకోవడానికి వారిపై వరాల జల్లు కురిపిస్తోంది.
Show comments