iDreamPost

కోర్టు సంచలన తీర్పు.. తల్లికి కుమార్తె భరణం ఇవ్వాల్సిందే

  • Published May 22, 2024 | 8:46 AMUpdated May 22, 2024 | 8:46 AM

సాధారణంగా భరణం అనగానే భార్య భర్తకు.. లేదా భర్త భార్యకు చెల్లించేది అనే గుర్తుకు వస్తుంది. కానీ తాజాగా ఓ చోట మాత్రం.. కుమార్తె.. తన తల్లికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

సాధారణంగా భరణం అనగానే భార్య భర్తకు.. లేదా భర్త భార్యకు చెల్లించేది అనే గుర్తుకు వస్తుంది. కానీ తాజాగా ఓ చోట మాత్రం.. కుమార్తె.. తన తల్లికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published May 22, 2024 | 8:46 AMUpdated May 22, 2024 | 8:46 AM
కోర్టు సంచలన తీర్పు.. తల్లికి కుమార్తె భరణం ఇవ్వాల్సిందే

సాధారణంగా విడాకుల కేసుల్లో.. భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుంది. వివాహం తర్వాత చాలా వరకు కుటుంబాల్లో ఆడవారు ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులను చూసుకోడం వంటి విధులకు పరిమితం అవుతారు. ఇక దురదృష్టం కొద్ది.. వారి బంధం బీటలు వారితే.. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఆడవారు.. విడిపోయిన తర్వాత బయటకు వెళ్లి తమ కోసం ఉపాధి వెతుక్కోలేరు.. చాలా సందర్భాల్లో దొరకదు కూడా. దాంతో విడాకులు కేసుల్లో.. విడిపోయిన తర్వాత భర్త.. తన భార్యకు భరణం ఇవ్వాలని కోర్టులు ఆదేశిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో భార్య కూడా భర్తకు భరణం ఇవ్వాలంటూ కొన్ని కోర్టులు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కుమార్తె తల్లికి భరణం ఇవ్వాల్సిందే అంటూ సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులనే కాదు.. వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని.. దీనిలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తండ్రి మరణం తర్వాత.. తల్లిని తన ఇంటికి పిలిపించుకుని.. ఆస్తులు లాక్కుని.. ఆ తర్వాత తల్లిని బయటకు గెంటేసింది ఓ కుమార్తె. దాంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. కన్నవారి ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు.. వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని అభిప్రాయపడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇండోర్‌ కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది. వయసు మళ్లిన తల్లికి జీవన భృతి కింద కుమార్తె భరణం చెల్లించాలని కోర్డు ఆదేశాలు చేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన 78 ఏళ్ల మహిళ.. తన కుమార్తె (55)పై కోర్టులో కేసు దాఖలు చేసింది. తనకు ఒక్కతే కుమార్తె సంతానమని.. ఆమె తన ఆస్తి మొత్తం లాక్కుని.. కోవిడ్‌ సమయంలో తనను ఇంటి నుంచి తరిమేసిందని ఆ వృద్ధురాలు ఆరోపించారు. తన భర్త మధ్యప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వాడని.. అతడు 2001లో మరణించాడని చెప్పుకొచ్చింది. భర్త చనిపోయిన దగ్గర నుంచి తాను ఒంటరిగా ఉంటున్నాను అని.. ఈ క్రమంలో కోవిడ్‌కు ముందు తన కుమార్తె.. తనను ఆమె ఇంటికి తీసుకెళ్లిందని తెలిపింది.

కొన్ని రోజులు తనను బాగానే చూసుకుందని.. ఆ తర్వాత తన పేరుపై వారసత్వంగా సంక్రమించిన ఇంటిని అమ్మించి.. ఆ డబ్బులను తీసుకుందని బాధితురాలు చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను కూడా కుమార్తె తీసుకుందని చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం లాక్కుందని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత నుంచి తనను చిత్ర హింసలకు గురి చేసిందని.. మరీ ముఖ్యంగా 2020 మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో.. కుమార్తె తనను ఎన్నో బాధలకు గురి చేసిందని వృద్ధురాలు వెల్లడించింది. అంతటితో ఆగక.. తనను ఇంట్లో నుంచి తరిమేసిందని చెప్పుకొచ్చింది. కుమార్తె మాటలు నమ్మి సర్వం కోల్పోయానని.. తనకు న్యాయం చేయాలని వేడుకుకుంది. కుమార్తె తన ఆస్తి మొత్తం లాక్కోవడంతో.. ప్రస్తుతం తనకు ఉండటానికి ఇల్లే కాదు.. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నట్టు వృద్ధురాలు వాపోయింది.

ఇక తన కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు సంపాదిస్తోందని, ఆమె నుంచి తనకు భరణం ఇప్పించాలని వృద్ధురాలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మాయ విశ్వలాల్.. తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని నిర్దారించారు. ఆ వృద్ధురాలికి నెలకు రూ.3,000 చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించారు. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి