P Krishna
సాధారణంగా పిల్లలకు డబ్బులు ఇస్తే చిన్న కిడ్డీ బ్యాంక్ లో వేసుకుంటారు. అలా ముద్దు ముద్దుగా దాచుకోవడం చూసి కుటుంబ పెద్దలు మెచ్చుకుంటారు.
సాధారణంగా పిల్లలకు డబ్బులు ఇస్తే చిన్న కిడ్డీ బ్యాంక్ లో వేసుకుంటారు. అలా ముద్దు ముద్దుగా దాచుకోవడం చూసి కుటుంబ పెద్దలు మెచ్చుకుంటారు.
P Krishna
సాధారణంగా ఎవరైనా సిలిండర్ ని వంటలకు ఉపయోగిస్తుంటారు. సిలిండర్ లో కేజీలను బట్టి వాటి సైజులు ఉంటాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు గ్యాస్ స్టౌపై వంటకాలు చేస్తున్నారు. ఇటీవల గ్యాస్ సిలిండర్ కి భారీగా ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వంటల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ డబ్బులు దాచే పెట్టెగా మార్చుకుంటే ఎలా ఉంటుంది.. ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ లో చిల్లర డబ్బులు దాచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లాడు తనకు ఇచ్చిన చిల్లర మొత్తం కిడ్డీ బ్యాంక్ లో వేస్తున్నాడు. అయితే కిడ్డీ బ్యాంక్ గా ఇంట్లో ఉన్న పెద్ద సిలిండర్ ని ఉపయోగించుకున్నారు. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లతో రక రకాల విన్యాసాలు చూశాం.. మొదటి సారిగా డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంగ్ గా ఎవరూ చూడలేదు. గ్యాస్ సిలిండర్ ని కట్టర్ తో కట్ చేసి ఓపెన్ చేయగా అందులో పెద్ద ఎత్తున చిల్లర నాణేలు బయట పడ్డాయి. అవన్నీ పదిరూపాయల కాయిన్స్ కావడం విశేషం.
సాధారణంగా పిల్లలకు డబ్బులు ఇస్తే ఏదైనా కిడ్డీ బ్యాంక్ లో దాచుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తుంటే ఇంట్లో పిల్లలు డబ్బులు దాచుకోవడానికి ఏకంగా పెద్ద సిలిండర్ వాడారు. కొంతకాలంగా పదిరూపాయల నాణేలు అందులో దాచుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.